Average Student Nani Movie: మెరిసే మెరిసే మూవీతో దర్శకుడిగా సక్సెస్ అందుకున్న పవన్ కుమార్ కొత్తూరి.. ‘యావరేజ్ స్టూడెంట్ నాని’ మూవీకి దర్శకత్వం వహిస్తూ హీరోగా నటించారు. ఈ సినిమా నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ ద్వారా ఈ చిత్రం థియేటర్లోకి సందడి మొదలు పెట్టింది. సినిమాకు పాజిటివ్ వస్తుండడంతో మూవీ టీమ్ హర్షం వ్యక్తం చేస్తోంది. హీరో, హీరోయిన్లు మీడియాతో ముచ్చటించారు. పవన్ కుమార్ మాట్లాడుతూ.. మెరిసే మెరిసే సినిమా తరువాత స్టూడెంట్ లైఫ్ కథ రాసుకన్నానని చెప్పారు. హీరో డీగ్లామర్‌గా ఉండాలని అనుకున్నానని.. తానే ఆ క్యారెక్టర్ చేయాలని అనుకున్నానని అన్నారు. హీరోయిన్ విషయంలో ముందే ఫిక్స్ అయ్యాయనని చెప్పారు.
Also Read: Telangana Cabinet: రేషన్ కార్డులపై తెలంగాణ సంచలన నిర్ణయం.. మంత్రివర్గం కీలక నిర్ణయాలు ఇవే!
ఝాన్సీ గారిని ఒప్పించేందుకు చాలా సమయం పట్టిందని.. పాత్ర గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నారని తెలిపారు. షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు హీరో, డైరెక్షన్ ఇలా అన్ని క్రాఫ్ట్లన హ్యాండిల్ చేస్తామని.. కానీ సినిమాలకు అన్ని హ్యాండిల్ చేయడం పెద్ద టాస్క్ అని అన్నారు. రొమాంటిక్ సీన్స్ చేయడం కష్టంగా అనిపించిందని.. ఇది థియేటర్లలో చూడాల్సిన సినిమా అని చెప్పారు పవన్ కుమార్.
స్నేహా మాల్వియ మాట్లాడుతూ.. సారా క్యారెక్టర్ గురించి విన్న వెంటనే తనకు చాలా నచ్చిందన్నారు. ఇలాంటి జీవితాన్ని ఎక్స్‌పీరియెన్స్ చేయాలని అనుకుంటారని తన రియల్ లైఫ్ కూడా సారాలానే ఉంటుందని చెప్పుకొచ్చారు. అందరి దృష్టి తనపైనే ఉండాలనుకునే మనస్తత్వం అని అన్నారు. తనకు ఇదే మొదటి సినిమా అని.. తాను కాస్త అల్లరి చేస్తుంటానన్నారు. పవన్ కుమార్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందన్నారు. ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నానంటూ తెలిపారు.
సాహిబా బాసిన్ మాట్లాడుతూ.. యావరేజ్ స్టూడెంట్ నాని మూవీలో యాక్ట్ చేయడం హ్యాపీగా ఉందన్నారు. తనకు ఇంత మంచి పాత్రను ఇచ్చిన హీరో, డైరెక్టర్ పవన్ కుమార్‌కు థ్యాంక్స్ చెప్పారు. ఆయన చాలా మంచి వ్యక్తి అని.. ఒకే టైంలో అన్ని క్రాఫ్ట్‌లను హ్యాండిల్ చేశారని మెచ్చుకున్నారు. ఆయన తమను ఎంతో జాగ్రత్తగా చూసుకున్నారని.. చాలా కంఫర్ట్ ఇచ్చారని చెప్పుకొచ్చారు.
Also Read: Mahindra Thar Roxx: 5 డోర్లతో మహీంద్రా థార్ రాక్స్ వచ్చేస్తోంది.. దిమ్మతిరిగే ఫీచర్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.