ముంబై: కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన కొన్ని గంటల్లోపే ప్రియాంక చుతువ్వేది శివసేన పార్టీ తీర్థం పుచుకున్నారు. ముంబైలోని మాతోశ్రీ భవన్ లో పార్టీ అధ్యక్షుడు ఉధ్ధవ్ థాక్రే ఆమెను పార్టీ కండువ కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఈ పార్టీ సీనియర్ నేత ఆదిత్య థాక్రే తో పాటు పార్టీ ముఖ్యనేతలు హాజరయ్యారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రియంక చుతుర్వేది రాక పార్టీని మరింత బలోపేతం చేస్తుందనే ఈ సందర్భంగా థాక్రే ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రియంక చతుర్వేది ఉదయం అధికార ప్రతినిధి ప్రతినిధి పదవితో పాటు ప్రాధామిక సభ్యుత్వానికి రాజీనామా చేశారు. నిరక్షరాస్యులైన గూండాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తూ ఆమె పార్టీకి రిజైన్ చేశారు. తన పట్ల అభస్యంగా ప్రవర్శించిన నేతలను సస్పెండ్ చేసి మళ్ల పార్టీలోకి తీసుకోవడంపై ఆమె మనస్థాపానికి లోనై రాజీనామా చేశారు. ట్విట్రర్ వేదికగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు
ప్రియాంక సంచలన నిర్ణయం; కాంగ్రెస్ నుంచి శివసేనలోకి జంప్ !!