నేటి మ్యాచ్ గెలిస్తే ..ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు

ఈ రోజు  రాజస్థాన్‌ రాయల్స్‌ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది

Last Updated : Apr 11, 2019, 06:09 PM IST
నేటి మ్యాచ్ గెలిస్తే ..ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు

చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ధోనీ ఐపీఎల్‌లో అరుదైన రికార్డుకి చేరువలో ఉన్నాడు. ఈ రోజు జరిగే మ్యాచ్ లో గెలిస్తే ధోనీ సారథ్యంలో సీఎస్‌కేకి 100వ విజయం సాధించినట్లవుతుంది. ఈ రోజు ధీనీ టీం ... రాజస్థాన్‌ రాయల్స్‌ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి తీరాలనే కసితో చెన్నై సూర్ సూపర్ కింగ్స్ ఉంది. ఇదే జరిగితే ధోనీ ఖాతాలో సరికొత్త రికార్డు వచ్చి పడుతుంది..

మహేంద్ర సింగ్‌ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఐపీఎల్ 2019 లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుత సీజన్‌లో ఇప్పటిరకు ఆ జట్టు మొత్తం 6 మ్యాచులు ఆడగా అందులో ఐదింటిలో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది. ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తే పాయింట్ల పట్టిలో మరింత ముందుకు వెళ్తుంది.
 

Trending News