Lakshmi Narayana Raja Yoga Effect In Telugu: కొన్ని గ్రహాలు ఒకే రాశిలో కలవడాన్ని జ్యోతిష్య శాస్త్రంలో సంయోగం అని అంటారు. ఈ సంయోగానికి కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. రెండు గ్రహాలు కలిసిన తర్వాత ఏర్పడిన ఈ సంయోగం కారణంగా అన్ని రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది. ఇదిలా ఉంటే బుధుడు శుక్రుడు కర్కాటక రాశిలోకి కల్వబోతున్నాయి. దీని కారణంగా ఎంతో శక్తివంతమైన యోగంగా పిలవబడే లక్ష్మీనారాయణ రాజయోగం ఏర్పడుతుంది. అయితే జూలై 7న కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశించిన సంగతి అందరికీ తెలిసిందే. బుధుడు జులై 29న అదే రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. ఈ గ్రహం జులై 31వ తేదీన శుక్ర గ్రహంతో సంయోగం చెందబోతోంది. దీని కారణంగా మూడురాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అలాగే ఈ సమయంలో వారికి ఆర్థిక లాభాలు కలగడమే కాకుండా కొన్ని ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. అయితే ఈ లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా ఏయే రాశుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
సంయోగం కారణంగా లాభపడే రాశులు..
మిధున రాశి:
శుక్రుడు బుధుడు కర్కాటక రాశిలో సంయోగం చేయడం కారణంగా మిధున రాశి వారికి అదృష్టం పెరుగుతుంది. దీని కారణంగా అనేక చోట్ల నుండి డబ్బులు పొందడమే కాకుండా కొత్త ఆదాయ వనరులు సంపాదిస్తారు. అలాగే వీరు ఈ సమయంలో స్థిరాస్తులు కూడా కొనుగోలు చేయగలుగుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేస్తున్న మిధున రాశి వారు ఈ సమయంలో అనేక లాభాలు పొందుతారు. పదోన్నతులతో పాటు విపరీతంగా జీతాలు పెరువుతాయి. అలాగే ఈ లక్ష్మీనారాయణ రాజయోగంతో వీరికి జీవితంలో శ్రేయస్సుతోపాటు ఆనందం లభించి ఎలాంటి పనుల్లోనైనా విజయాలు సాధించే శక్తిని పొందుతారు.
కర్కాటక రాశి:
లక్ష్మీనారాయణ రాజయోగం కారణంగా కర్కాటక రాశి వారు కూడా బోలెడు లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ యోగ ప్రభావంతో లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది. దీంతోపాటు ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల కెరీర్ కు సంబంధించిన జీవితంలో అద్భుతమైన లాభాలు పొందుతారు. అంతేకాకుండా కుటుంబ జీవితంలో కూడా అనేక సమస్యలు తొలగిపోయి..ఆనందం పెరుగుతుంది. దీంతోపాటు ఈ రాశి వారు కొత్త ఇల్లుతో పాటు భవనాలు కూడా కొనుగోలు చేయగలుగుతారు. అలాగే వీరికి అదృష్టం సహకరించి ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతాయి. గతంలో ఉన్న అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా నయం అవుతాయి. దీంతోపాటు వీరు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తి చేసుకోగలుగుతారు.
మకర రాశి:
ఈ సంయోగం కారణంగా మకర రాశి వారు కూడా బోలెడు ప్రయోజనాలు పొందుతారు. ముఖ్యంగా వీరు ఈ సమయంలో శుభవార్తలు పొందడమే కాకుండా సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. ముఖ్యంగా ప్రేమ జీవితం గడుపుతున్న వారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. అలాగే భాగస్వామితో శృంగార కోరికను కూడా తీర్చుకుంటారు. ముఖ్యంగా వివాహం కాని యువకులకు ఈ సమయంలో ప్రతిపాదనలు వస్తాయి. అలాగే భాగస్వామ్య జీవితం గడుపుతున్న వారికి భార్యతో మంచి సంబంధం ఏర్పడుతుంది. వివాదాల నుంచి కూడా పూర్తిగా విముక్తి లభించి అన్ని సమస్యలు తొలగిపోతాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
లక్ష్మీనారాయణ యోగం కారణంగా ఉద్యోగాలు చేసేవారు విపరీతమైన లాభాలు పొందగలుగుతారు. ముఖ్యంగా వీరు కొత్త బాధ్యతలు స్వీకరించడమే కాకుండా ఎలాంటి పనులైన తొందరగా చేయగలుగుతారు. అలాగే వ్యాపారాలు చేసే వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా కొత్త కాంట్రాక్టర్లు పొందడమే కాకుండా పెట్టుబడులు కూడా పెట్టే ఛాన్సులు ఉన్నాయి.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..