ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ : దుమారం రేగుతున్న పీవీపీ వ్యాఖ్యలు

ప్రత్యేక హోదాపై విజయవాడ వైసీపీ లోక్ సభ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ ) వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. 

Last Updated : Mar 21, 2019, 12:35 PM IST
ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ : దుమారం రేగుతున్న పీవీపీ వ్యాఖ్యలు

విజయవాడ: ప్రత్యేక హోదాపై వైసీపీ లోక్ సభ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ ) వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. విజయవాడలో జరిగిన సీఐఐ సదస్సులో పీపీవీ ఏపీ ఎకానమిక్ డెవెలప్ మెంట్ పై సుదీర్ఘంగా ప్రగంగించారు. ఈ క్రమంలో ఒకానొక సందర్భంలో  ప్రత్యేక హోదా ఓ బోరింగ్‌ సబ్జెక్ట్ అని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షాలకు ఈ వ్యాఖ్యలు అస్త్రంగా మారాయి. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ వైసీపీని తీవ్రస్థాయిలో ఎండగడుతున్నారు. ప్రత్యేక హోదాపై గౌరవం కానీ విశ్వాసం కానీ వైసీపీకి లేదంటూ పీవీపీపై టీడీపీ  దుమ్మెత్తిపోస్తోంది.

హోదా బోరింగ్ సబ్జెక్ట్ అట - చంద్రబాబు

విజయవాడ వైసీపీ లోక్ సభ అభ్యర్ధి పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ ) వ్యాఖ్యలపై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. టీడీపీ నేతలతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ  ప్రత్యేక హోదా బోరింగ్ సబ్జెక్ట్ అని వైసీపీ ఎంపీ అభ్యర్థులే ఉంటున్నారని పీవీపీ వ్యాఖ్యాలను పరోక్షంగా ప్రస్తావించారు. ఈ వ్యాఖ్యలను జనాల్లో తీసుకెళ్లి వైసీపీ ఎండగట్టాలని టీడీపీ శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు.  మోడీ ప్రభుత్వాన్ని అవిశ్వాస తీర్మానం నుంచి గట్టెక్కించేందుకే వైసీపీ ఎంపీలు రాజీనామా చేశారని చంద్రబాబు విమర్శించారు.  ప్రత్యేక హోదాపై వైసీపీ వారికి చిత్తశుద్ధి లేదనడానికి పీపీవీ వ్యాఖ్యలే అందుకు నిదర్శనమన్నారు

 పీవీపీపై కేశినేని నాని ఫైర్...

ప్రత్యేక హోదా అంశం బోరింగ్ సబ్జెక్ట్ అన్న పీవీపీ వ్యాఖ్యల పై టీడీపీ లోక్ సభ అభ్యర్ధి కేనినేని నాని ఘాటుగా స్పందించారు. హోదా బోరింగ్ సబ్జెక్ట్ అనడం పీవీపీ అవివేకానికి నిద్శనమన్నారు. అంతర్జాతీయ నేరాలకు పాల్పడిన పీవీపీకి ప్రజా సమస్యలపై అవగాహన లేదని ఎద్దేవ చేశారు. పీవీపీ లాంటి వాళ్ల సభకు వెళితే అపవిత్రం అవుతుందన్నారు. ఇలాంటి వాళ్లకు వైసీపీ సీటు ఇవ్వడం దురద్రుష్టకరమని కేశినేని నాని విమర్శించారు

తన వ్యాఖ్యలపై పీవీపీ వివరణ...

ప్రత్యేక హోదాపై తాను చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారి విమర్శలకు దారితీయడంతో ఈ అంశంపై పీవీపీ స్పందించారు. సీఐఐ సదస్సులో తాను చేసిన వ్యాఖ్యలు వ్యాఖ్యలను టీడీపీ వారు వక్రీకరిస్తున్నారని.. వాస్తవానికి  తాను ఎకానమిక్ డెవెలప్ మెంట్ మాట్లాడదల్చుకున్నానని తెలిపారు. ఈ సందర్భంగా హోదా అనేది ప్రతి ఒక్కరి తెలిసిన విషయమని.. ఇందులో ఉన్న ఆర్ధిక ప్రయోజనాల గురించే తాను ప్రస్తావించేందుకు ప్రయత్నించానని ..ఈ ఉద్దేశంతో తాను అలా మాట్లాడానని పీపీపీ వివరణ ఇచ్చారు

Trending News