Supreme Court Next CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎవరీ సంజీవ్ ఖన్నా

Supreme Court Next CJI: దేశంలోని సర్వోన్నత న్యాయస్థానానికి తదుపరి ఛీఫ్ జస్టిస్‌గా జస్టిస్ సంజీవ్ ఖన్నా నియమితులు కానున్నారు. సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ స్వయంగా ఆయన పేరు ప్రతిపాదించారు. త్వరలో కేంద్రం దీనికి ఆమోదముద్ర వేయనుంది. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఎవరు, పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Oct 17, 2024, 10:06 AM IST
Supreme Court Next CJI: సుప్రీంకోర్టు తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా, ఎవరీ సంజీవ్ ఖన్నా

Supreme Court Next CJI: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగియనుంది. దాంతో తన తరువాత తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నా పేరును కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించారు. నిబంధనల ప్రకారం ఈ ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదముద్ర వేయనున్నారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా నియమితులు కానున్నారు. 

సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ పదవీకాలం నవంబర్ 10తో ముగియనుంది. తన స్థానంలో తదుపరి సీజేఐగా జస్టిస్ సంజీవ్ ఖన్నాను స్వయంగా జస్టిస్ చంద్రచూడ్ ప్రతిపాదించారు. సుప్రీంకోర్టు 51వ ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్న జస్టిస్ సంజీవ్ ఖన్నా మే 13 వరకూ అంటే దాదాపు 7 నెలలు ఈ పదవిలో ఉంటారు. నిబంధనల ప్రకారం జస్టిస్ డీవై చంద్రచూడ్ ప్రతిపాదనను కేంద్ర న్యాయశాఖ పరిశీలించి ప్రధానమంత్రికి పంపిస్తుంది. ప్రధాని ఆమోదం తరువాత రాష్ట్రపతికి చేరుకుంటుంది. రాష్ట్రపతి ఆమోదముద్రతో తదుపరి ప్రధాన న్యాయమూర్తి ఎంపిక ఖరారవుతుంది. 2022 నవంబర్ 9వ తేదీన ఛీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ డీవై చంద్రచూడ్ ఎక్కువకాలం ఈ పదవిలో ఉన్నారు. 

ఎవరీ జస్టిస్ సంజీవ్ ఖన్నా

జస్టిస్ సంజీవ్ ఖన్నా బార్ కౌన్సిల్ ఆఫ్ ఢిల్లీలో న్యాయవాదిగా 1983లో నమోదు చేయించుకున్నారు. తీస్ హజారీ కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. ఆ తరువాత ఢిల్లీ హైకోర్టులో న్యాయవాదిగా కొనసాగారు. 2004లో ఇన్‌కంటాక్స్ శాఖకు సీనియర్ స్టాండింగ్ కౌన్సిల్‌గా సేవలందించారు. ఢిల్లీ హైకోర్టులో ఎమికస్ క్యూరీగా, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా సేవలు కొనసాగించారు. ఆ తరువాత 2005లో ఢిల్లీ హైకోర్టు అడిషనల్ జడ్జిగా, 2006లో శాశ్వత న్యాయమూర్తిగా నియుక్తులయ్యారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా ఢిల్లీ జ్యుడీషియల్ అకాడమీ ఛైర్మన్‌గా, ఢిల్లీ ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ ఇన్‌ఛార్జిగా కొనసాగారు.

2019 జనవరి 18వ తేదీన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. ఏ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలు అందించకుండానే సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయ్యారు. ఎలక్టోరల్ బాండ్స్, ఆర్టికల్ 370 తొలగింపు, సెంట్రల్ విస్టా ప్రాజెక్ట్ సంబంధిత కేసుల్లో జస్టిస్ సంజీవ్ ఖన్నా పాత్ర కీలకమైంది.

Also read: Rain Alert: హైదరాబాద్‌కు బిగ్ అలర్ట్, వచ్చే 4 గంటల్లో నగరంలో భారీ వర్షం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News