Tomato Ghee Rasam Recipe: సాధారణంగా మన అమ్మమ్మల కాలం నాటి నుంచి టమాటా రసం తయారు చేసుకుంటాం. అయితే, మీరు ఎప్పుడైనా టమాటాలు, నెయ్యి, మిరియాలు కలిపి టమాటా రసం తయారు చేసుకున్నారా? ఇది చర్మంతోపాటు ఇమ్యూనిటీ వ్యవస్థకు కూడా మంచిది. టమాటా రసంలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్ సీ, ఇ, బీటా కెరోటిన్ వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ రసం తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ వ్యవస్థ కూడా బలపడుతుంది. ముఖ్యంగా ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. క్యాలరీలు కూడా తక్కువగా ఉంటాయి. బరువు కూడా సులభంగా తగ్గిపోతారు.
కావాల్సిన పదార్థాలు..
టమాటాలు- పావుకిలో
నీళ్లు- లీటరు
ధనియాలు - 1tbsp
ఉప్పు- రుచికి సరిపడా
మిరియాలు-1tbsp
జిలకర్ర-1tbsp
కందిపప్పు-1 tbsp
ఎండుమిర్చి-3
చక్కెర- టీస్పూన్
నెయ్యి-2tbsp
ఆవాలు- 1tbsp
కరివేపాకు
ఇదీ చదవండి: వర్షాకాలం ముందే మందార మొక్కకు ఈ జాగ్రత్తలు తీసుకుంటే గుత్తులు గుత్తులుగా పూలు పూస్తాయి..
టమాటా రసం తయారీ విధానం..
కుక్కర్లో టమాటాలు వేసి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత వాటిని మిక్సీలో వేసి ప్యూరీ మాదిరి రుబ్బుకోవాలి. ఇప్పుడు ధనియాలు, మిరియాలు, జిలకర్ర, కందిపప్పు, ఎండుమిర్చిలను మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి.
ఇదీ చదవండి: అవిసెగింజలతో 5 హెయిర్ ప్యాక్‌లు.. పార్లర్‌కు వెళ్లకుండానే మెరిసే మృదువైన జుట్టు మీ సొంతం..
ఆ తర్వాత ఓ ప్యాన్ తీసుకుని అందులో టమాట ప్యూరీ, నీళ్లు, ఉప్పు, చక్కెర కూడా వేసుకోవాలి. దీన్ని మరిగించుకోవాలి. ఇప్పుడు తాలింపు కోసం ఓ చిన్న కడాయి తీసుకుని నెయ్యి వేసి జిలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి వేయించుకోవలి. దీన్ని మరుగుతున్న రసంలో వేసుకోవాలి. వేడివేడిగా ఈ టమాట రసం అన్నంలో వేసుకుని తీసుకుంటే చివరి ముద్ద వరకు వదలకుండా తింటారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి