Prabhutvaa Junior Kalashala Movie Review: ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు - 500143 మూవీ రివ్యూ.. ఎలా ఉందంటే..

Prabhutvaa Junior Kalashala Movie Review:  తెలుగులో టీనేజ లవ్ స్టోరీలకు ఎఫుడు మంచి గిరాకీ ఉంటుంది. ఈ కోవలో తెరకెక్కిన మరో చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల'. ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

Written by - TA Kiran Kumar | Last Updated : Jun 21, 2024, 04:29 PM IST
Prabhutvaa Junior Kalashala Movie Review: ప్రభుత్వ జూనియర్ కళాశాల పుంగనూరు - 500143 మూవీ రివ్యూ..  ఎలా ఉందంటే..

నటీనటులు: ప్రణవ్ ప్రీతం, షాజ్ఞ శ్రీ వేణున్, రామ్ పటాస్, తేజ గౌడ్, బాంబే పద్మ, శ్రీమునిచంద్ర, మండపేట మల్లిక జాగుల
సినిమాటోగ్రఫీ : నిఖిల్ సురేంద్రన్
ఎడిటర్: కోదాటి పవన్ కల్యాణ్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ : సయ్యద్ కమ్రాన్
బ్యానర్: బ్లాక్ ఆంట్ పిక్చర్స్
నిర్మాత: భువన్ రెడ్డి కొవ్వూరి
రైటర్,  డైరెక్టర్: శ్రీనాథ్ పులకురం

కథ విషయానికొస్తే..
గత కొన్నేళ్లుగా తెలుగులో నిజ జీవిత గాథలతో తెరకెక్కే చిత్రాలకు ప్రేక్షకులు ఆదిరిస్తున్నారు. ఈ కోవలో తెరకెక్కిన చిత్రం 'ప్రభుత్వ జూనియర్ కళాశాల - పుంగనూరు -500143'. శ్రీనాథ్ పులకురం డైరెక్ట్ చేసిన ఈ సినిమాను బ్లాక్ ఆంట్ పిక్చర్స్ బ్యానర్ పై శ్రీమతి కొవ్వూరు అరుణ సమర్పణలో ప్రొడ్యూసర్ కొవ్వూరు భువన్ రెడ్డి నిర్మించారు. మరి ఈ సినిమా ప్రేక్షకులు మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం..

కథ విషయానికొస్తే..

వాసు (ప్రణవ్ ప్రీతమ్) పుంగనూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతుంటాడు. అదే కాలేజీలో ఆకట్టుకునే అందంతో ఉండే కుమారి (షాజ్ఞ శ్రీ వేణున్) చదువుతూ ఉంటుంది. ఆమె దృష్టిలో పడాలని ఆ కాలేజీలోని గురువులు, సీనియర్స్ అందరు తమ వంతు ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ క్రమంలో వాసు,  కుమారి ఒకరికొకరు ఇష్టపడతారు. అది హద్దులు దాటిపోతుంది. హద్దులు దాటిన వీరి ప్రేమ పెళ్లికి దారితీసిందా.. ఈ క్రమంలో వీళ్లిద్దరు ఎలాంటి గడ్డు పరిస్థితులను ఫేస్ చేసారనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

కథనం, టెక్నికల్ విసయానికొస్తే..
తెలుగులో టీనేజ్ లవ్ స్టోరీలకు ఎపుడు ఆదరణ ఉంటుంది. అలనాటి మరో చరిత్ర నుంచి మొదలు పెడితే.. చిత్రం,జయం వరకు వచ్చిన సినిమాలన్ని ప్రేక్షకులు ఆదరణకు నోచుకున్నాయి. మెజారిటీ చిత్రాలు సక్సెస్ సాధించాయి. దాదాపు అదే తరహా జానర్ లో దర్శకుడు  శ్రీనాథ్ పులకురం నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ కథను రాసుకున్నాడు. ఫస్ట్ హాఫ్ మొత్తంగా కాలేజీ సరదాలు.. ర్యాగింగ్ గట్రా అన్ని ప్రేక్షకులను అలరిస్తాయి. మాములు కాలేజీ కుర్రవాళ్ల మధ్య ఎలా మాట‌్లాడుకుంటారు. వారి బిహేవియర్ ఎలా ఉంటుందనేది చక్కగా తెరపై ప్రెజెంట్ చేసాడు. మరోవైపు నిరుపేద ఇళ్లలలోని బాధలను కూడా కళ్లకు కట్టాడు. మరోవైపు తన ప్రేమకు ఆస్తులు, అంతస్తులు ఎలా అడ్డుగోడలా నిలిచాయనేది ఎంతో హృద్యంగా తెరపై ఆవిష్కరించాడు. చివరకు తమ ప్రేమను గెలిపించుకోవడం కోసం చేసే ప్రయత్నాలు సినిమాటిక్ గా ఉన్న.. ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాయి.  మొత్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రేక్షకులను కనెక్ట్ అయ్యేలా చేయడంలో సక్సెస్ సాధించాడనే చెప్పాలి.
నిర్మాతలు కూడా ఈ సినిమాను ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఫోటోగ్రఫీ నాచురల్ గా ఉంది. పాటలు కూడా యూత్ ను ఆకట్టుకునేలా ఉన్నాయి. ఎడిటర్ ఫస్టాఫ్ మరింత గ్రిస్పీగా తెరకెక్కించి ఉంటే బాగుండేది.

నటీనటుల విషయానికొస్తే..
ఇంటర్మీడియట్ చదివే కుర్రాడి పాత్రలో  ప్రణవ్ ప్రీతమ్ ఎంతో సహజంగా ఒదిగిపోయాడు. హీరోయిజం ఎలివేషన్ గట్రా లేకుండా నాచురల్ గా నటించాడు. మరోవైపు హీరోయిన్ గా నటించిన షాజ్ఞ శ్రీ వేణున్ తన పాత్రలో అందంగా ఒదిగిపోయింది. అంతేకాదు హీరో, హీరోయిన్స్ ల తల్లిదండ్రుల పాత్రలు కూడా ఆకట్టుకుంటాయి.  వీరిద్దరి మధ్య వచ్చే సీన్స్ ప్రేక్షకులను ఎంగేజ్ చేస్తాయి. మిగతా పాత్రల్లో నటించిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు.

రేటింగ్..2.75/5

Read more: Viral News in Telugu: కొంపముంచిన రీల్.. 300 అడుగుల లోతైన లోయలో పడిపోయిన కారు.. షాకింగ్ వీడియో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News