Tecno Phones: శాంసంగ్, వన్‌ప్లస్, రెడ్మి, రియల్ మి, ఒప్పో, వివో ఫోన్లతో పాటు ఇటీవల పోకో, టెక్నో ఫోన్లకు సైతం ఆదరణ పెరుగుతోంది. అద్భుతమైన ఫీచర్లు కలిగి ఉండి ధర అందుబాటులో ఉండటం ప్రధాన కారణణం. ప్రీమియం ఫోన్లను తలదన్నే ఫీచర్లు బడ్జెట్ ధరకే లభిస్తున్నాయి.
టెక్నో నుంచి నిన్న జూన్ 17న Tecno Spark 20 Pro 5G లాంచ్ అయింది. 6.78 ఇంచెస్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే కలిగి ఉంటుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6080 చిప్సెట్తో పనిచేస్తుంది. కనెక్టివిటీ పరంగా చూస్తే బ్లూటూత్ 5.3 వెర్షన్ , వైఫై 6 ఉన్నాయి. ఇక ఆన్‌బోర్డ్ సెన్సార్లలో ఏంబియంట్ లైన్ సెన్సార్, ఇ కంపాస్, ఫింగర్ ప్రింట్ సెన్సాల్, జి సెన్సర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు ఉన్నాయి. ఎట్మోస్ డాల్బీ ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు ఉండటం వల్ల మ్యూజిక్ బాగా ఎంజాయ్ చేయవచ్చు. 33 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సపోర్ట్ చేస్తుంది.
Tecno Spark 20 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేస్తుంది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. స్క్రీన్ కెమేరా చుట్టూ డైనమిక్ పోర్ట్ ఫీచర్ ప్రత్యేక ఆకర్షణగా ఉంటుంది. ఇందులో 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ సామర్ధ్యం వేరియంట్ ఉంది. ఆన్‌బోర్డ్ మెమరీ అయితే 16 జీబీ వరకూ ర్యామ్ పెంచుకోవచ్చు. కెమేరా గురించి పరిశీలిస్తే ఏకంగా 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరాతో డ్యూయల్ కెమేరా సెటప్ ఉంది. ఆప్టికల్ జూమ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్ ఉంటుంది. సెల్ఫీ లేదా వీడియా కాల్ కోసం 8 మెగాపిక్సెల్ కెమేరా ఉంది.
చైనా ఇతర దేశాల్లో లాంచ్ అయినా Tecno Spark 20 Pro 5G త్వరలో మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, ఆగ్నేయాసియా, లాటిన్ అమెరికన్ దేశాల్లో లాంచ్ కానుంది. జూన్ 20 నుంచి సౌదీ అరేబియాలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి. ధర కూడా 12-15 వేలలోపే ఉండవచ్చని అంచనా ఉంది. కంపెనీ నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన వెలువడలేదు.
Also read: Portable AC: ఇంట్లో ఎక్కడైనా జరుపుకునే పోర్టబుల్ మూవింగ్ ఏసీ వచ్చేసింది
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook