Jackfruit Seed Benefits: పనస పండులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి ఈ పండు రుచికి తీయగా ఉంటుంది ఇందులో ఫైబర్ ప్రోటీన్ విటమిన్ ఏ మెగ్నీషియం పొటాషియం విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి పనస పండు డయాబెటిస్ రోగులకు కూడా మంచిది ఇందులో లైసెన్స్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగనివ్వదు అయితే పనస పండు కాదు అందులో గింజల్లో కూడా ఆరోగ్యం పుష్కలంగా ఉంటుంది ఇందులో ప్రియమైన రైబో ఫ్లెవిన్స్ ఉంటాయి ఇది మన కంటే చర్మ జుట్టు ఆరోగ్యానికి మంచిది పనస గింజల్లో జింకు ఐరన్ కాల్షియం కాపర్ పొటాషియం పెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు పనస గింజలు యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి పనస గింజలతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం.
జీర్ణ ఆరోగ్యం..
పనసగింజల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది ఇది పేగు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది కడుపు సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుంది. జీర్ణ ఆరోగ్యం కోసం పనస గింజలను డైట్లో చేర్చుకోవాలి.
గుండె ఆరోగ్యం..
పనస గింజల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ ని తగ్గించి రక్తనాళాలకు రిలీఫ్ ఇస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మంచిది గుండె సమస్యలు రాకుండా నివారిస్తుంది.
ఇదీ చదవండి: ఖాళీ కడుపున వెల్లుల్లి రసం తీసుకుంటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా?
ఎముక ఆరోగ్యం..
పనస గింజల్లో ఎముక ఆరోగ్యానికి సహకరించే ఖనిజాలు ఉంటాయి. ఇందులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు మెగ్నీషియం కూడా ఉండటం వల్ల ఇది ఎముక ఆరోగ్యాన్ని బలంగా మారుస్తుంది.
ఎనీమియా..
చాలామంది ఎనిమియ సమస్యతో బాధపడుతుంటారు. ముఖ్యంగా మహిళలు పనస గింజలను తీసుకోవడం వల్ల ఎర్ర రక్త కణాలు పెరుగుతాయి. పనసగింజల్లో ఐరన్ ఎక్కువగా ఉంటుందో ఇది మన పిల్లల ఆక్సిజన్ లెవెల్స్ పెరగడానికి తోడ్పడుతుంది. ఎనీ మియా రాకుండా కాపాడుతుంది.
ఇదీ చదవండి: ఖాళీ కడుపున వాము టీ తీసుకుంటే మీ శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?
మెటబాలిజం..
కార్బోహైడ్రేట్స్ అధిక మోతాదులో ఉంటాయి. ఇది మన శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది. ఇందులో విటమిన్ బి కాంప్లెక్స్ ఉండటం వల్ల బాడీ మెటబాలిజం మెరుగుపడుతుంది. మన పూర్వీకుల కాలం నుంచి కూడా పసన గింజలను ఉడికించి, కాల్చి తినే అలవాటు కూడా ఉంటుంది.
మెంటల్ స్ట్రెస్..
పనస గింజల్లో మెంటల్ స్ట్రెస్ ని తగ్గించే గుణం ఉంటుంది. ఇందులో ప్రోటీన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి పనస గింజల్లో మన రోజంతటికి కావాల్సిన హైడ్రేషన్ అందిస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి