Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాద దృశ్యాలు

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ సహా ఉన్నతాధికారులు హెలీకాప్టర్ కుప్పకూలడంతో దుర్మరణం చెందిన వార్త ఒక్కసారిగా షాక్ కల్గించింది. నిన్న ఈ ప్రమాదం జరగగా 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ తరువాత మరణవార్తను ధృవీకరించారు.

Ebrahim Raisi Helicopter Crash: ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, విదేశాంగ శాఖ మంత్రి హుస్సేన్ అమీర్ అబ్దుల్లాహియాన్ సహా ఉన్నతాధికారులు హెలీకాప్టర్ కుప్పకూలడంతో దుర్మరణం చెందిన వార్త ఒక్కసారిగా షాక్ కల్గించింది. నిన్న ఈ ప్రమాదం జరగగా 18 గంటల రెస్క్యూ ఆపరేషన్ తరువాత మరణవార్తను ధృవీకరించారు.

1 /7

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. అధ్యక్షుని మరణంపై ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా ఖొమైనీ దేశంలో 5 రోజులు సంతాపదినాలు ప్రకటించారు

2 /7

నిన్న అంటే ఆదివారం మే 19వ తేదీ మద్యాహ్నం 12.30 గంటలకు అజర్ బైజాన్ అధ్యక్షుడు ఇల్హాస్ అలీయేవ్‌తో కలిసి అరాస్ నదిపైనిర్మించిన డ్యామ్ ప్రారంభోత్సవంలో అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ పాల్గొన్నారు. 

3 /7

ఆదివారం మద్యాహ్నం 2.15 గంటలకు ఇబ్రహీం రైసీ హెలీకాప్టర్ ద్వారా డ్యామ్ ఏరియల్ సర్వే చేశారు. దాదాపు 3.25 గంటలకు ఇరాన్‌కు అదే హెలీకాప్టర్ ద్వారా పయనమయ్యారు. కాన్వాయ్‌లో మరో రెండు హెలీకాప్టర్లు ఉన్నాయి.

4 /7

సాయంత్రం 5.45 గంటలకు ఇరాన్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సంబంధాలు తెగిపోయాయి. హెలీకాప్టర్ ఏమైందో తెలియలేదు. మిగిలిన రెండు హెలీకాప్టర్లు సురక్షితంగా ల్యాండ్ అయ్యాయి. సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీం రైసీ ప్రయాణిస్తున్న హెలీకాప్టర్ కూలినట్టుగా సమాచారం అందింది.  దాంతో రెస్క్యూ ఆపేరషన్ ప్రారంభమైంది.

5 /7

ప్రతికూల వాతావరణం, భారీ వర్షం కారణంగా హెలీకాప్టర్ లొకేషన్ గుర్తించడం కష్టమైంది. రాత్రంగా సెర్చ్ తరువాత టర్కీ ద్రోన్లు దూరం నుంచి క్రాష్ ప్రాంతాన్ని గుర్తించగలిగాయి. అజర్ బైజాన్ సరిహద్దులోని ఇరాన్‌కు చెందిన వర్జేధన్ పట్టణం వద్ద క్రాష్ అయినట్టు తేలింది.

6 /7

సెర్చ్ ఆపరేషన్ రాత్రంతా కొనసాగింది. ఇవాళ ఉదయం అజర్ బైజాన్ కొండల్లో దట్టమైన అటవీ ప్రాంతంలో హెలీకాప్టర్ శకలాలు కన్పించాయి. 

7 /7

దూరం నుంచి పొగ రావడం గమనించిన టర్కీ ద్రోన్లు అక్కడికి చేరుకోగానే హెలీకాప్టర్ శకలాలు కన్పించాయి. ఆ తరువాతే ఇరాన్ అధ్యక్షుడి మరణవార్తను అధికారికంగా ప్రకటించారు.