Sachin Tendulkar Security: మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు దిగ్భ్రాంతికి గురి చేసే సంఘటన చోటుచేసుకుంది. అతడికి భద్రత కల్పించే కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ పరిణామంతో సచిన్ షాక్‌కు గురయ్యాడు. అతడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు? ఏం జరిగిందో ఇంకా వివరాలు తెలియలేదు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపడుతున్నారు.
Also Read: Thunderbolt: అమ్మమ్మ ఇంట్లో విషాదం.. క్రికెట్ ఆడుతున్న యువకుడిని బలిగొన్న పిడుగు
క్రికెట్ దేవుడుగా పిలిచే సచిన్ టెండూల్కర్‌కు స్టేట్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (ఎస్‌ఆర్‌పీఎఫ్) భద్రతా కల్పిస్తోంది. ఆయన భద్రతా సిబ్బందిలో కానిస్టేబుల్‌గా ప్రకాశ్ కాప్డే (39) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. అతడి స్వస్థలం మహారాష్ట్రలోని జామ్నెర్. కొన్ని రోజులు సెలవు తీసుకుని స్వస్థలం జామ్నెర్‌కు చేరుకున్నాడు. ఏం జరిగిందో తెలియదు కానీ మంగళవారం అర్ధరాత్రి తన ఇంట్లోనే తుపాకీతో కాల్చుకున్నాడు. మెడ భాగంలో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు. కాగా అతడికి భార్య, ఇద్దరు పిల్లలతో పాటు తల్లిదండ్రులు కూడా ఉన్నారు.
Also Read: Mothers Day: మదర్స్ డే రోజే తీరని విషాదం.. 'అమ్మా' అంటూ తల్లీని కాపాడబోయి కొడుకు మృతి
సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రకాశ్ ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా కుటుంబసభ్యులతో మాట్లాడుతున్నారు. అతడి సహోద్యోగుల నుంచి కూడా వివరాలు సేకరిస్తున్నారు. ఈ సంఘటనపై జామ్నర్ పోలీసులు మాట్లాడారు. 'వ్యక్తిగత కారణాలతో ప్రకాశ్ ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చు. వీవీఐపీ సెక్యూరిటీలోని గార్డు కావడంతో అతడి ఘటనపై ఎస్‌ఆర్‌పీఎష్ స్వతంత్ర దర్యాప్తు చేస్తుంది' అని జామ్నర్ పోలీసులు తెలిపారు. విచారణకు వారికి పూర్తి సహకారం అందిస్తామని ప్రకటించారు. అతడి ఆత్మహత్యకు పని ఒత్తిడి లేదా ఆర్థిక ఇబ్బందులు కారణంగా తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter