Chennai Super Kings Vs Rajasthan Royals Playing XI Dream11 Team Tips: ఐపీఎల్‌లో నేడు బిగ్‌ఫైట్ జరగనుంది. రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడనుంది. రాజస్థాన్ 11 మ్యాచ్‌ల్లో 8 విజయాలు, 16 పాయింట్లతో ప్లే ఆఫ్స్ బెర్త్ ఖాయం చేసుకుంది. ఇక చెన్నై ఆడిన 12 మ్యాచ్‌ల్లో 6 విజయాలు, 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే రాజస్థాన్‌పై తప్పకుండా నెగ్గాల్సిందే. రాజస్థాన్ విజయం సాధిస్తే.. అధికారికంగా ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టిన రెండో జట్టుగా నిలుస్తుంది. ఇప్పటికే కోల్‌కతా నైట్‌రైడర్స్ ఒక బెర్త్ ఫిక్స్ చేసుకుంది. మిగిలిన మూడు బెర్త్‌ల కోసం పోటీ ఉంది. ఆదివారం మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియం వేదికగా చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభంకానుంది.
Also Read: Krishnamma Collections: కృష్ణమ్మ కలక్షన్స్.. సత్యదేవ్ కెరియర్ లోనే మొదటిసారి ఇలా
హెడ్ టు హెడ్ రికార్డుల విషయానికి వస్తే.. ఈ రెండు జట్ల మధ్య 28 మ్యాచ్‌లు జరిగాయి. చెన్నై సూపర్ కింగ్స్ 15 మ్యాచ్‌ల్లో గెలుపొందగా.. రాజస్థాన్ రాయల్స్ 13 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఆదివారం మరో ఉత్కంఠ పోరు జరగనుంది. చెన్నై పిచ్ బ్యాటింగ్‌కు కొంచెం కష్టంగా ఉంటుంది. పిచ్ స్పిన్నర్లకు అనూకులంగా ఉంటుంది. మ్యాచ్ సాగుతున్న కొద్దీ స్లోగా మారుతుంది. ఈ వేదికపై 82 మ్యాచ్‌లు ఆడగా.. మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 48 మ్యాచ్‌లు గెలవగా.. రెండో బ్యాటింగ్ చేసిన జట్లు 34 మ్యాచ్‌లు గెలిచాయి. గూగుల్ విజయ సంభావ్యత ప్రకారం.. రాజస్థాన్‌ను చెన్నై ఓడించే అవకాశం 51 శాతం ఉంది. రాజస్థాన్ గెలిచే అవకాశం 49 శాతం ఉంది. సొంత గడ్డపై చెన్నై హాట్ ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.
తుది జట్లు ఇలా.. (అంచనా)
చెన్నై సూపర్ కింగ్స్: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, శివమ్ దూబే, మొయిన్ అలీ, రవీంద్ర జడేజా, మిచెల్ సాంట్నర్, ఎంఎస్ ధోని (వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, తుషార్ దేశ్‌పాండే, సిమర్జీత్ సింగ్
రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్ (కెప్టెన్, వికెట్ కీపర్), రియాన్ పరాగ్, ధృవ్ జురెల్, రోవ్‌మన్ పావెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, అవేష్ ఖాన్, యుజ్వేంద్ర చాహల్
CSK Vs RR Dream11 Prediction:
==> వికెట్ కీపర్: సంజూ శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్
==> బ్యాట్స్‌మెన్: రుతురాజ్ గైక్వాడ్ (వైస్ కెప్టెన్), శివమ్ దుబే, యశస్వి జైస్వాల్
==> ఆల్ రౌండర్లు: రవీంద్ర జడేజా, రియాన్ పరాగ్
==> బౌలర్లు: తుషార్ దేశ్‌పాండే, చాహల్, ట్రెంట్ బౌల్ట్, అవేశ్ ఖాన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter
CSK vs RR Dream11 Team: రాజస్థాన్ రాయల్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ బిగ్ ఫైట్.. హెడ్ టు హెడ్ రికార్డులు.. డ్రీమ్11 టీమ్ ఇదిగో..!