Congress Minister Konda Surekha Fires On Ex CM KCR And KTR: బీఆర్ఎస్ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను బహిరంగంగానే ఉరితీయాలని, మంత్రి కొండా సురేఖ అన్నారు. రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో కాంగ్రెస్ జనజాతర సభలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు.. మల్లీకార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, దీపాదాస్ మున్షీ, సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క,పలువురు తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు సమావేశానికి హజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ పలు సందర్భాలలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ నేతలను కుక్కలకొడుకుల్లారా.. అంటూ వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ నోటికొచ్చినట్లు కాంగ్రెస్ నేతలను తిడుతున్నారని ఫైర్ అయ్యారు.
కేసీఆర్ తిట్టే మాటలకి ఆయనని ఉరి తీసినా తక్కువే - మంత్రి కొండా సురేఖ pic.twitter.com/O8Ht889nTl
— Telugu Scribe (@TeluguScribe) April 6, 2024
కేసీఆర్ తెలంగాణ మహిళలను, ప్రజలను తిడుతున్నావా.., చెప్పలేని విధంగా బూతులు తిడుతున్నాంటూ ఆమె సీరియస్ అయ్యారు. దీనిపై ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదని, ఆయనపై ఎలాంటి కేసులు నమోదు చేయాలో చెప్పాలన్నారు. అదేవిధంగా.. బీఆర్ఎస్ లీడర్... కేటీఆర్ నీ పక్కన మీ తండ్రి ఉన్నాడని, మా గురించి మాట్లాడుతవ్.. మీ తండ్రిపై ఎలాంటి కేసులు పెట్టాలో చెప్పాలంటూ మంత్రి కొండా సురేఖ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా తుక్కుగూడ ప్రాంగణమంతా ఒక జతారలాగా మారిపోయింది. ఎక్కడ చూసిన కార్యకర్తలతో తుక్కుగూడ ప్రాంగణమంతా నిండిపోయింది.
ఈ సమావేశాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ఈ వేదిక మీదుగానే కాంగ్రెస్ లోక్ సభ ఎన్నిలక శంఖారావంను పూరించింది. ఈ సమావేశంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. యువన్యాయం, నారీ న్యాయం, రైతు న్యాయం, శ్రామిక న్యాయం, సామాజిక న్యాయం పేరుతో ఐదు గ్యారంటీలను ప్రకటించారు.
Read More: CM Revanth Reddy: రేవంత్‌కు హైకమాండ్ ఝలక్.. 12 మంది BRS ఎమ్మెల్యేల చేరికకు బ్రేక్..
ఇదిలా ఉండగా.. తుక్కుగూడ సభలో మరో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ పార్టీకి చెంది, భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు మీటింగ్ లో కన్పించారు. కాసేపట్లో రాహుల్ గాంధీ సమక్షంలో హస్తంకండువ కప్పుకొనున్నారు. ఇప్పటికే ఖైరతాబాద్, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి సహా పలువురు బీఆర్ఎస్ కు చెందిన కీలక నేతలు కాంగ్రెస్‌లో చేరిన విషయం తెలిసిందే.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook