Sarangadariya Movie: సారంగదరియా మూవీ నుంచి ‘అందుకోవా’ సాంగ్ రిలీజ్

Andukova Lyrical Song: సారంగదరియా మూవీ నుంచి అందుకోవా.. లిరికల్ సాంగ్‌ను హీరో నవీన్ చంద్ర విడుదల చేశారు. పద్మారావు అబ్బిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో రాజా రవీంద్ర ప్రధాన పాత్ర పోషించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా.. త్వరలోనే ఆడియన్స్ ముందుకురానుంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 5, 2024, 05:23 PM IST
Sarangadariya Movie: సారంగదరియా మూవీ నుంచి ‘అందుకోవా’ సాంగ్ రిలీజ్

Andukova Lyrical Song: సీనియర్ నటుడు రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా సారంగదరియా. సాయిజా క్రియేషన్స్ పతాకంపై ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ.. త్వరలోనే ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఎం.ఎబెనెజర్ పాల్ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి ‘అందుకోవా..’ అనే లిరికల్ సాంగ్‌ను మేకర్స్ శుక్రవారం రిలీజ్ చేశారు. విలక్షణ నటుడు, హీరో నవీన్ చంద్ర ఈ సాంగ్‌ను విడుదల చేసి.. మూవీ యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ పాటకు లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర తన గాత్రం అందించారు. సాంగ్ ఇన్‌స్పిరేషనల్‌గా ఉంది. మనం అనుకున్న లక్ష్యాన్ని చేరే క్రమంలో ఎన్ని అవరోధాలు వస్తాయి. కానీ ఆ కష్టాలను ఎదుర్కొంటూ ముందుకు సాగాలని చెప్పేలా స్పూర్తిని నింపేలా ఈ పాట ఉంది. రాంబాబు గోశాల ఈ సాంగ్‌ను రాశారు. 

సాంగ్ రిలీజ్ సందర్భంగా ప్రొడ్యూసర్స్ ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ.. మా  సారంగదరియా మూవీ నుంచి ‘అందుకోవా..’ లిరికల్ సాంగ్‌ను విడుదల చేసిన హీరో నవీన్ చంద్రకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. లెజెండ్రీ సింగర్ చిత్ర మా సాంగ్‌ను పాడటం తమకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని.. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు. 

దర్శకుడు పద్మారావు అబ్బిశెట్టి(పండు) మాట్లాడుతూ.. సారంగదరియా సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నానని తెలిపారు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జరిగిన కొన్ని ఘర్షణలతో సినిమా కథ ఉంటుందని చెప్పారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించామని.. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయన్నారు. చిత్ర గారు పాడిన ‘అందుకోవా..’ పాటను విడుదల చేయటం చాలా సంతోషంగా ఉందన్నారు. సాంగ్‌ను రిలీజ్ చేసిన హీరో నవీన్ చంద్రకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. శ్రీకాంత్ అయ్యంగార్, శివ చందు, యశస్విని, మొయిన్ , మోహిత్, నీల ప్రియా, కదంబరి కిరణ్, మాణిక్ రెడ్డి, అనంతబాబు, విజయమ్మ, హర్షవర్ధన్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.

సాంకేతిక వర్గం:

==> బ్యానర్-సాయిజా క్రియేషన్స్
==> నిర్మాతలు- ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి
==> దర్శకత్వం- పద్మారావు అబ్బిశెట్టి (పండు) 
==> ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - అరుణాచల మహేష్
==> మాటలు- వినయ్ కొట్టి
==> ఎడిటర్- రాకేష్ రెడ్డి
==> మ్యూజిక్ డైరెక్టర్- ఎం.ఎబెనెజర్ పాల్ 
==> సినిమాటోగ్రఫీ - సిద్ధార్థ స్వయంభు 
==> పాటలు-రాంబాబు గోశాల, కడలి
==> అడిషనల్ రైటర్- రఘు రామ్ తేజ్.కె
==> PRO- తుమ్మల మోహన్, చంద్ర వట్టికూటి.

Also Read: Anaparthi Seat: అనపర్తి అసమ్మతిపై చంద్రబాబు దిగొచ్చినట్టేనా, సీటు మార్చే ఆలోచన

Also Read: Save The Tigers 2: బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్.. ఇండియా టాప్ 3 లిస్టులో ‘సేవ్ ది టైగర్స్’

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News