Taapsee: తాప్సీ పెళ్లి వీడియో వైరల్.. డాన్స్ వేస్తూ అలరించిన హీరోయిన్

Tapsee wedding: తాప్సీ కి పెళ్లయిందా లేదా అని ఆమె అభిమానులు ఈమధ్య సోషల్ మీడియాలో తెగ తాపత్రేయ పడిపోయారు. అందుకు ముఖ్య కారణం ఈ హీరోయిన్ కి పెళ్లి అయింది అని వార్తలు వచ్చిన ఒక్క ఫోటో కూడా బయటకి రాకపోవడమే. ఈ క్రమంలో ఇప్పుడు తాప్సీ పెళ్లి వీడియో కాస్త తెగ వైరల్ గా మారింది

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 3, 2024, 08:35 PM IST
Taapsee: తాప్సీ పెళ్లి వీడియో వైరల్.. డాన్స్ వేస్తూ అలరించిన హీరోయిన్

Tapsee Wedding Video:
తెలుగు ప్రేక్షకులకు తాప్సీ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మంచు మనోజ్ హీరోగా చేసిన ఝుమ్మంది నాదం చిత్రంతో తన సినీ కెరియర్ ప్రారంభించింది ఈ హీరోయిన్. ఆ తరువాత తెలుగులో ఎన్నో సినిమాలలో నటించింది. ముఖ్యంగా తాప్సీ ప్రభాస్ తో చేసిన మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా మంచి విజయం సాధించింది. అయినా కానీ ఎందుకో తాప్సీకి తెలుగులో అనుకున్నన్నీ అవకాశాలు రాలేదు. ఆ తరువాత బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ హీరోయిన్ అక్కడ మాత్రం స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ముఖ్యంగా కథ ప్రాధాన్యత ఉన్న సినిమాలు చేస్తూ ఎంతో పేరు తెచ్చుకుంది. కాగా గత కొద్ది రోజుల నుంచి తాప్సి పెళ్లి గురించి వార్తలు జోరుగా వినిపిస్తూ వచ్చాయి. పది సంవత్సరాల నుంచి తాను ప్రేమిస్తున్న వ్యక్తిని తాప్సీ పెళ్లి చేసుకుందని సోషల్ మీడియాలో ఒక వార్త పెద్ద ఎత్తున ప్రచారం కాసాగింది. 

 తాప్సీ పన్ను పెళ్లి అయిన మాట వాస్తవమే కానీ.. ఆ పెళ్లికి సంబంధించిన వీడియోలు కానీ.. ఫొటోలు కానీ.. ఎక్కడా లీక్ చెయ్యకుండా చాలా జాగ్రత్తగా తీసుకునింది ఈ హీరోయిన్. మార్చి 23న ఉదయ్ పూర్‌లో తాప్సీ.. తన ప్రియుడు, ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు మథియాస్ బోయ్‌ను పెళ్లి చేసుకుంది తాప్సి. అయితే నిన్నటి వరకు కూడా ఈ పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటకు రాలేదు.

ఈ క్రమంలో తాజాగా తాప్సీ పన్ను - మథియాస్ బోయ్‌ పెళ్లి వీడియో ఒకటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోలో తాప్సి ఎరుపు రంగు దుస్తులు వేసుకొని.. కళ్లకి కూలింగ్ గ్లాస్‌లు పెట్టుకుని.. డాన్స్ చేస్తూ పెళ్లి పందిరిలో కనిపించడం విశేషం. కొత్త పెళ్లి కూతురు తెగ జోష్ లో ఉండగా.. వరుడు మథియాస్ బోయ్‌ ఆమెకు ఎదురు వెళ్లి స్వాగతం పలికి తన ప్రేమను వ్యక్తపరుస్తూ పెళ్లి వేడుకలో ఖుషీ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతూ అందరినీ ఆకట్టుకుంటుంది.

 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BollywoodNow (@bollywoodnow)

Also Read: Deepthi Sunaina: పరువాలతో పిచ్చెక్కిస్తున్న దీప్తి సునైనా, లేటెస్ట్ ఫోటోలు వైరల్

Also Read:  Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

FacebookTwitter సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News