Somavati Amavasya 2024: సోమవతి అమావాస్య రోజు ఈ రెమిడీ చేస్తే శత్రువులు సైతం మోకరిల్లాల్సిందే..

Somavati Amavasya 2024 Remedy: సోమవతి అమావాస్య ఎంతో పదరమా పవిత్రమైన రోజు ఈ రోజు చేసే పూజ వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే అమావాస్య సోమవారం నాడు వస్తే దాని సోమావతి అమావాస్య అంటారు.

Written by - Renuka Godugu | Last Updated : Apr 2, 2024, 11:02 AM IST
Somavati Amavasya 2024: సోమవతి అమావాస్య రోజు ఈ రెమిడీ చేస్తే శత్రువులు సైతం మోకరిల్లాల్సిందే..

Somavati Amavasya 2024 Remedy: సోమవతి అమావాస్య ఎంతో పదరమా పవిత్రమైన రోజు ఈ రోజు చేసే పూజ వల్ల అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. ఎప్పుడైతే అమావాస్య సోమవారం నాడు వస్తే దాని సోమావతి అమావాస్య అంటారు. అమావాస్య సోమావరం లేదా శనివారం వస్తే దాని శక్తి రెట్టింపు అవుతుంది. అందుకే ఈరోజుల్లో స్నాన దానాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈరోజు చాలా శక్తివంతమైన రోజు. 

పురాణాల ప్రకారం ఈ సోమవతి అమావాస్య నాడే తెలియక రెండు కాకులు శివాలయంలో శివుని చుట్టూ తిరిగాయట మరుసటి జన్మలో అవి శివుని ప్రధాన గణాలలో చోటు దక్కించుకున్నాయి.ఇది కాశీఖండంలో ఉంది. అంతటి మహిమాన్వితమైనరోజు సోమావతి అమావాస్య. సోమావతి అమావాస్య 2024 ఏప్రిల్ 8న రానుంది. అంతేకాదు సోమావతి అమావాస్యరోజు పూర్వీకులకు కూడా ఆహారం పెట్టే నియమం ఉంది. ఈరోజు పితృదోషం నుంచి బయటపడటానికి కూడా ప్రత్యేకమైన రోజు. ముఖ్యంగా ఈరోజు నది స్నానం చేస్తారు.

ప్రత్యేకంగా ఈరోజు మీ దగ్గర్లోని శివాలయాలకు వెళ్లి ప్రదక్షిణలు చేయాలి. ఇలా సోమావతి అమావాస్యనాడు శివునికి ప్రదక్షిణలు చేస్తే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. కచ్చితంగా ఈ రోజు శివాలయానికి వెళ్ళండి దీంతో జన్మ జన్మంతాల పాపాలు తొలగిపోతాయి. ఈరోజు ముఖ్యంగా పరమేశ్వరుని తుమ్మి పూలతో పూజలు చేస్తారు.ఆడవారు ఈరోజు అమా సోమవారం వ్రతం చేస్తారు. అంటే రావిచెట్టును పూజించడం. అమా సోమవారం వారవ్రతం అంటే ఆడవాళ్లు ఈ సోమవతి అమావాస్యనాడు రావిచెట్టు చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తారు. ఏదైనా ఒక పండును లేదా ఎండు కర్జూరాలు లేదా కిస్మిస్ కూడా రావి చెట్టుకు సమర్పించాలి. 108 ఎండు ద్రాక్ష లేదా ఎండు ఖర్జూర పండ్లు రావి చెట్టుకు సమర్పించిన తర్వాత వాటిని దానం చేయాలి.

ఇదీ చదవండి: ఇంట్లో శివుడి లింగం ఏ పరిమాణంలో ఉండాలి.. రోజు అభిషేకం చేయాలా..?.. జ్యోతిష్యులు ఏమంటున్నారంటే..

ఇలా ఆడవారు సోమావతి అమావాస్యనాడు చేసే వ్రతం కుటుంబం పిల్లలను అష్టైశ్వర్యాలతో ఆరోగ్యం ప్రాప్తిస్తుంది అంతటి శక్తి ఈ అమా సోమవారం వ్రతానికి ఉంది.చాలామంది పిల్లలు లేని సమస్యతో బాధపడుతున్నారు ఇలాంటి వారు సోమావతి అమావాస్యనాడు రావిచెట్టు వద్ద పెన్నులు, పెన్సిళ్లు పెట్టి పూజించాలి. ఆ తర్వాత వాటిని చిన్న పిల్లలకు దానం చేయాలి ఈరోజు ప్రత్యేకంగా ఏవైనా పక్షులకు ఆహారం పెట్టాలి ఇలా చేయడం వల్ల సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. అరుదైన అత్యంత శక్తివంతమైన సోమావతి అమావాస్య నాడు శ్రీ పురుషులు ఇద్దరూ శివాలయంలో ప్రదక్షిణాలు చేయాలి.

ఇదీ చదవండి:  తెలుగు ప్రజలకు శుభవార్త.. అయోధ్యకు ఎంచక్కా ఎగిరిపోవచ్చు

ఈరోజు శుభకార్యాలు పెట్టుకోవద్దు. మద్యం, మాంసం తీసుకోవద్దు. ఈరోజు ప్రత్యేకంగా పెద్దలను అవమానం కలిగించకూడదు. మూగజీవాలకు ఆహారం పెట్టాలి. ఈరోజు మిరియాలతో చేసే రెమిడీ కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది. మిరియాలను తీసుకుని ఓం క్లీం బీజ మంత్రాన్ని పఠించి ఇంటి పెద్ద నుంచి తిప్పి ఇంటికి దక్షిణ దశలో పారేయాలి. ఇలా చేస్తే మీకు శతృవులే ఉండరు. ఉన్నా వారు మిమ్మల్ని బాధపెట్టలేరు.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News