మహిళా మంత్రి లేకపోవడానికి కారణం చెప్పిన కేటీఆర్

                    

Last Updated : Nov 15, 2018, 02:11 PM IST
మహిళా మంత్రి లేకపోవడానికి కారణం చెప్పిన కేటీఆర్

హైదరాబాద్: కేసీఆర్ కేబినెట్ లో మహిళా మంత్రి లేకపోవడంపై అడిగిన ప్రశ్నకు తెలంగాణ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు.  ' మీట్ ద ప్రెస్' కార్యక్రమంలో తెలంగాణ మంత్రి కల్వకుంట్ల కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ పరిపాలన తీరుకు సంబధించిన అనేక విషయాలపై స్పందించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధి అడిగిన ప్రశ్నకు బదులిస్తూ రాజకీయ సమీకరణాలు, రకరకాల ఈక్వేషన్స్ ను బట్టి పాలనలో నిర్ణయాలు ఉంటాయని .. అందుకే మహిళా మంత్రిని నియమించలేదన్నారు. అయినా పాలన విషయంలో తమ  లెక్కలు తమకు ఉంటాయి.. ఇందులో తప్పేముందున్నారు. భవిష్యత్తులో దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని.. ఇందులో ఆవేశపడాల్సిన అవసరమేముందుని మీడియా ప్రతినిధికి బదులిచ్చారు. 

కేసీఆర్ కేబినెట్ లో ఇప్పటి వరకు మహిళా మంత్రి లేని విషయం తెలిసిందే. టీఆర్ఎస్ లో పలువురు మహిళా ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేబినెట్ లో వారికి చోటు దక్కలేదు.  ఈ నేపథ్యంలో గత కొన్ని రోజుల నుంచి కేసీఆర్ మహిళా వ్యతిరేకి అనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనపై మహిళా వ్యతిరేకి అనే ముద్ర వేశారు. కాగా మహిళ మంత్రిని ఎందుకు నియమించలేదని  అనేక మంది అనేక వేదికలపై అనేక సార్లు ఇదే ప్రశ్నలు సంధించారు. దీనిపై సమాధానం కేటీఆర్ దాట వేస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఇదే అంశంపై మళ్లీ అడిగిన ప్రశ్నకు కేటీఆర్ స్పష్టమైన సమాధానం ఇవ్వలేదనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఒకవైపు ఈ ప్రశ్నకు స్పష్టమైన జబాబు ఇవ్వకపోగా..ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధిపై ఎదురుదాడి చేయడం సరికాదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 

 

Trending News