Agra Woman Announces Rs 50000 Reward For Husbands Murder: సమాజంలో యువత వివాహబంధానికి ఉన్న గొప్పతనాన్ని దిగజారున్నారు. తమ మొండితనం, నాదే నెగ్గాలి అనేమనస్తత్వం, దీంతో పెళ్లి చేసుకున్న కూడా వారితో అడ్జస్ట్ కాలేకపోతున్నారు. చిన్న చిన్న కారణాలతో డైవర్సీల వరకు వెళ్లిపోతున్నారు. పెళ్లైన తర్వాత గొడవలు కామన్. దీన్ని మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతే కానీ కొందరు దీని కోసం ఆవేశాలు, గొడవలకు పోయి నానా బీభత్సం చేస్తున్నారు. కొందరు గొడవలు జరిగితే నాలుగు గోడల మధ్య మాట్లాడుకుని పరిష్కరించుకుంటే, మరికొందరు అందరి ముందు పంచాయతీలసు పెట్టుకుని తమ పరువును, తమ వాళ్ల గౌరవాన్ని బజారుకు ఈడ్చుతున్నారు.
Read More: Viral Video: వీడేం షాడిస్టురా నాయన.. చికెన్ టెస్టీగా వండలేదని భార్యను ఇంత ఘోరమా.?.. వైరల్ వీడియో..
ఈ క్రమంలో కొందరు పెళ్లాయ్యాక వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. దీంతో కట్టుకున్న వారితో గొడవలు పెట్టుకుని, పుట్టింటికి వెళ్లిపోతున్నారు. మరికొందరు సుపారీలు ఇచ్చి హత్యలు చేయించడం వరకు కూడా వెళ్తున్నారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది.
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లోని భింద్ లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వార్తలలో నిలిచింది. 2022 లో ఆగ్రాలోని భింద్ కు చెందిన ఒక మహిళతో పెళ్లి జరిగింది. ఐదునెలల పాటు ఇద్దరి మధ్య కాపురం బాగానే సాగింది. ఇదిలా ఉండగా..సదరు మహిళలకు ఇంటి ముందు అద్దెకు ఉంటున్న యువకుడి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో భర్తను దీన్ని పసిగట్టి పద్ధతి మార్చుకోవాలని భార్యను పలుమార్లు హెచ్చరించాడు. దీంతో ఇద్దరి మధ్య ప్రతిరోజు గొడవలు జరిగేవి. ఇవ భర్తను భరించలేక , సదరు మహిళ తన పుట్టింటికి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఆమె తన భర్తను బెదిరింపులకు గురిచేసేంది. ఆమె ప్రియుడు కూడా చంపుతానని, వార్నింగ్ ఇచ్చాడు. అంతేకాకుండా సదరు మహిళ రివర్స్ లో భర్తపై స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి డౌరీ హరాస్ మెంట్ కింద కేసుపెట్టింది.
ఇదిలా ఉండగా.. డిసెంబర్ 21, 2023న తాను భింద్ నుండి తిరిగి వస్తుండగా అత్తమామలు తనను చంపుతామని సదరు మహిళ బెదిరించిందని భర్త పేర్కొన్నాడు.ఇది జరిగిన వెంటనే, అతని భార్య తన భర్తను చంపే వ్యక్తికి ₹ 50,000 రివార్డ్ అందజేస్తూ WhatsApp స్టేటస్ లో భర్త చూశాడు. వెంటనే సదరు భర్త గాబారా పడిపోయి దాన్ని స్క్రీన్ షాట్ తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు విచారణ చేపట్టారు. ప్రస్తుతం ఈ ఘటన మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్లు ఇదేం రివర్స్ టార్చర్ రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook