Budh Ast 2024 effect: గ్రహాల కదలికలు మనిషి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. బుద్ధినిచ్చే బుధుడు గమనంలో పెను మార్పు రాబోతుంది. ఏప్రిల్ 04, ఉదయం 10:36 గంటలకు బుధుడు మేషరాశిలో అస్తమించబోతున్నాడు. సాధారణంగా అస్తమయ సమయంలో గ్రహాలు చెడు ఫలితాలను ఇస్తాయి. బుధుడి యెుక్క ఈ కదలిక కారణంగా ఏ రాశులవారు ప్రతికూల ప్రభావాలను ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం.
మేష రాశి
ఇదే రాశిలో బుధుడి యెుక్క అస్తమయం సంభవించబోతుంది. దీని కారణంగా మేషరాశి వారు అనేక కష్టాలను ఎదుర్కోంటారు. మీకు లక్ కలిసిరాదు. మీ వైవాహిక జీవితంలో కలహాలు వస్తాయి. పిల్లలు కోసం మరి కొంత కాలం వేచిచూడాల్సి రావచ్చు.
కన్యా రాశి
మేషరాశిలో బుధుడి అస్తమయం కారణంగా కన్యారాశి వారు అనేక సమస్యలకు గురికావాల్సి ఉంటుంది. మీరు మెుదలుపెట్టిన పనులు మధ్యలోనే ఆగిపోతాయి. జాబ్ చేసేవారు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. మీరు తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. వ్యాపారులు మునుపెన్నడూ చూడని నష్టాలను చవిచూస్తారు.
కర్కాటక రాశి
మెర్క్యూరీ కదలిక కారణంగా కర్కాటక రాశి వారు కష్టాలు పెరుగుతాయి. ఆఫీసులో మీ బాస్ చేత చివాట్లు తింటారు. మీరు జాబ్ కోల్పోయే అవకాశం ఉంది. మీరు మెుదలుపెట్టిన పనులు పెండింగ్ లోనే ఉండిపోతాయి. మీరు మానసిక ఆందోళన చెందుతారు. మిమ్మల్ని దారిద్య్రం వెంటాడుతోంది.
Also Read: Lakshmi Yogam In Telugu: ఏప్రిల్ 9న ఈ రాశుల వారిపై కుబేరుడి వరాల జల్లు.. విపరీతమైన లాభాలే లాభాలు..
వృషభరాశి
బుధుడి స్థానం మార్పు వృషభరాశి వారి సమస్యలను పెంచుంది. మీ జీవితం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటుంది. మీరు అప్పులు ఊబిలో కూరుకుపోతారు. మీపై పని ఒత్తిడి పెరుగుతుంది. మీరు చేపట్టిన ప్రతి పనిలోనూ ఫెయిల్ అవుతారు. కుటుంబంలో అనుకోకుండా సమస్యలు వస్తాయి.
(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read: Solar Eclipse 2024: వచ్చే నెలలో సంపూర్ణ సూర్యగ్రహణం.. మన దేశంపై ప్రభావం ఉంటుందా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి
ఏప్రిల్ నెలలో ఈ 4 రాశుల జీవితాన్ని నాశనం చేయబోతున్న బుధుడు.. ఇందులో మీ రాశి ఉందా?