Bengaluru water crisis: సిలికాన్ సిటీగా పేరొందిన బెంగళూరు నగరం తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. ఈ ప్రాంతంలో తగినంత వర్షాలు కురవకపోవడంతో కావేరీ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి. దాని ప్రభావం బెంగళూరు నగరంపై పడింది. అంతేకాకుండా ప్రణాళిక లేని నిర్మాణ పనులు, సహజసిద్ధమైన నీటి వనరులను పట్టించుకోకపోవడం కూడా మెట్రో వాసులు తీవ్ర నీటి కొరతకు కారణాలు. ఈ సమస్యను పరిష్కరించేందుకు మార్చి 05న కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కేబినెట్ మంత్రులు, అధికారులు సమావేశమయి.. చర్చించారు. 13 మిలియన్లకు పైగా జనాభా ఉన్న బెంగళూరులో నీటి సంక్షోభం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నీరు వృథా చేస్తే 5 వేల జరిమానా..ఎక్కడంటే?
ఇదిలా ఉండగా, మరోవైపు బెంగళూరులోని వైట్‌ఫీల్డ్ ప్రాంతంలోని హౌసింగ్ సొసైటీ తాగునీటి వృథా చేసేవారిపై రూ.5000 జరిమానా విధించాలని నిర్ణయించింది. అంతేకాకుండా దీని అమలు తీరు పర్యవేక్షించేందుకు సెక్యూరిటీ గార్డులను కూడా నియమించనున్నట్లు తెలిపింది. ఈ సోసైటీకి గత నాలుగు రోజులుగా బెంగుళూరు నీటి సరఫరా మరియు మురుగునీటి బోర్డు (BWSSB) నుండి నీరు అందడం లేదు. దీంతో నీటి సరఫరాను 20 శాతం తగ్గిస్తున్నట్లు తెలుపుతూ నివాసితులకు నోటీసులు జారీ చేసింది పామ్ మెడోస్ సొసైటీ. త్వరలో 40 శాతానికి పెంచుతామని పేర్కొంది. నగరంలో గతంలో ట్యాంకర్ నీరు రూ.700 వరకు ఉండగా.. ఇప్పుడు ఏకంగా దానిని రూ.2 వేలకు పెంచేశారు ట్యాంకర్ యాజమానులు. తాగునీటి కోసం అంత డబ్బులు వెచ్చించలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఇవి తగ్గించుకోండి..
బెంగళూరులో తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో అధికారులు అత్యవసర చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా..అన్ని నీటిపారుదల మరియు వాణిజ్య బోర్వెల్లను స్వాధీనం చేసుకోవడం మరియు నగరంలోని ప్రతి ప్రైవేట్ వాటర్ ట్యాంకర్‌ను తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేయడం వంటివి ఉన్నాయి. నివాసితులు కార్లు మరియు బాల్కనీలు కడగడం మానేయాలని.. సగం బకెట్ నీటితోనే స్నానం చేయాలనీ, ఫ్లోర్ మరియు బాత్రూమ్లను తుడుచుకోవడానికి ఆక్వాగార్డ్ ఫిల్టర్లు ఉపయోగించాలని సూచిస్తున్నారు.
Also Read: Loksabha Elections 2024: సుప్రీంకోర్టులో డీకే శివకుమార్‌కు బిగ్ రిలీఫ్, మనీ లాండరింగ్ కేసు కొట్టివేత
Also Read: D Raja: భారత్ ఒక దేశమే కాదు.. తమిళనాడు ఒక దేశం: ఎంపీ రాజా సంచలన వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook