ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌లో ఓ వాహనాన్ని డ్రైవ్ చేస్తోన్న ఓ పోలీసు సిబ్బంది ఆ రాష్ట్ర మంత్రి సతీష్ మహన కాళ్లపై పడి ప్రాధేయపడుతూ క్షమాపణలు వేడుకున్న వైనం చర్చనియాంశమైంది. కాన్వాయ్‌లో ఉన్న మంత్రి వాహనాన్ని సదరు పోలీసు కానిస్టేబుల్ నడుపుతున్న వాహనం తాకడంతో మంత్రిగారు కాస్త అతడిపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. దీంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితుల్లో మంత్రి పాదాలు తాకుతూ పోలీసు కానిస్టేబుల్ క్షమాపణలు చెప్పుకున్నాడు. కాన్పూర్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతానికి సంబంధించిన వీడియోను ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్విటర్లో పోస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది
#WATCH: Policeman driving a vehicle in Chief Minister Yogi Adityanath's convoy touches the feet of Minister Satish Mahana to apologise after his vehicle touched the latter's car in Kanpur; says, 'there was little space & I was trying to make space for his car when it happened' pic.twitter.com/eJWxlz6pNK
— ANI UP (@ANINewsUP) October 22, 2018
కారు నడుపుతున్న సమయంలో అక్కడ ఎక్కువగా స్థలం లేదని, కారును కొద్దిగా పక్కకు జరిపే క్రమంలోనే ఈ చిన్న పొరపాటు జరిగిందని పోలీసు కానిస్టేబుల్ మంత్రిగారికి బహిరంగంగానే వివరణ ఇచ్చుకున్నట్టు తెలుస్తోంది.