Upcomig IPO Details: వచ్చేవారం ఎంట్రీ ఇస్తున్న 4 ఐపీవోలు, మీ అదృష్టం పరీక్షించుకోండి

షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. వచ్చే వారం ఏకంగా 4 ఐపీవోలు మార్కెట్‌లో వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. గత వారంలో రెండు ఐపీవోలు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. వచ్చేవారం నాలుగు ఐపీవోలు లిస్ట్ కానున్నాయి. 

Upcomig IPO Details: షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టాలనే ఆలోచన ఉంటే ఇదే మంచి అవకాశం. వచ్చే వారం ఏకంగా 4 ఐపీవోలు మార్కెట్‌లో వస్తున్నాయి. తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ రిటర్న్స్ పొందవచ్చు. గత వారంలో రెండు ఐపీవోలు మార్కెట్‌లో లిస్ట్ అయ్యాయి. వచ్చేవారం నాలుగు ఐపీవోలు లిస్ట్ కానున్నాయి. 

1 /4

ఇక వచ్చేవారం ఎట్‌మాస్ట్‌కో లిమిటెడ్ , ఎస్కోనెట్ టెక్నాలజీస్ లిమిటెడ్, ఇంటీరియర్స్ అండ్ మోర్ లిమిటెడ్, కళారిధన్ ట్రెండ్స్ లిమిటెడ్, థాల్ కాస్టింగ్ లిమిటెడ్ ఐపీవోలు కూడా లిస్టింగ్ కానున్నాయి. 

2 /4

ఎస్ఎంఈ విభాగంలో జెనిత్ డ్రగ్స్ 40.6 కోట్ల రూపాయల ఐపీవోను ఫిబ్రవరి 19న ప్రవేశపెట్టనుంది. ఫిబ్రవరి 22 వరకే బిడ్ సమర్పించవచ్చు. ఈ ఇష్యూ లిమిట్ 79 రూపాయలే. 1600 షేర్లు ఒకేసారి తీసుకోవచ్చు. ఇదికాకుండా డీమ్ రోల్ టెక్ ఫిబ్రవరి 20వ తేదీన పబ్లిక్ ఇష్యూ తీసుకొస్తోంది. ఈ ఇష్యూ ప్రైస్ 129 రూపాయలుగా ఉంది. 

3 /4

కోల్‌కతాకు చెందిన జీపీటీ హెల్త్‌కేర్ ఐఎల్ఎస్ హాస్పిటల్ బ్రాండ్‌తో మిడ్ సైజ్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల్ని నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 22న ఐపీవో ఓపెన్ అవుతుంది. ఫిబ్రవరి 26న క్లోజ్ కానుంది. 10 రూపాయల ఫేస్ విలువతో ఈ ఐపీవో ద్వారా 40 కోట్లు సమీకరించనుంది. 

4 /4

హయాత్ బ్రాండ్‌లో హోటల్స్ నిర్వహిస్తున్న జూనియర్ హోటల్స్ ఐపీవో ఫిబ్రవరి 21న ఓపెన్ కానుంది. ఫిబ్రవరి 23న క్లోజ్ అవుతుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ 1800 కోట్లు సేకరించాలనుకుంటోంది. 10 రూపాయలు ఫేస్ విలువతో ఐపీవో 342-360 రూపాయలు మధ్యలో ఉండవచ్చు