Jammu Kashmir Pics: భూతల స్వర్గంగా పిల్చుకునే జమ్ము కశ్మీర్ లోయల్లో మంచు విపరీతంగా పెరిగిపోయింది. చలిగాలులు తీవ్రమయ్యాయి. ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలకు పడిపోయింది. శ్రీనగర్లో ఇవాళ కనిష్ట ఉష్ణోగ్రత మైనస్ 3.8 డిగ్రీలు నమోదైంది. జమ్ములో అత్యంత తక్కువ ఉష్ణోగ్రత ఉంది. జమ్ము కశ్మీర్ పర్యాటకుల్ని ప్రధానాకర్షణగా అలరించే దాల్ సరస్సు సగానికిపైగా గడ్డకట్టుకుపోయింది. ఇంకేముందు సరస్సు అందాలు మరింత ద్విగుణీకరిస్తున్నాయి.
Jammu Kashmir Pics: భూతల స్వర్గం జమ్ము కశ్మీర్లో గడ్డకట్టిన దాల్ సరస్సు, పోటెత్తుతున్న పర్యాటకులు