Currency Nagar Movie Review: మనీ బ్యాక్‌డ్రాప్‌లో 'కరెన్సీ నగర్'.. ఆంతాలజీ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Currency Nagar Movie Review: ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మితమైన చిత్రం కరెన్సీ నగర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచమయ్యారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 29, 2023, 05:17 PM IST
Currency Nagar Movie Review: మనీ బ్యాక్‌డ్రాప్‌లో 'కరెన్సీ నగర్'.. ఆంతాలజీ థ్రిల్లర్  ఎలా ఉందంటే..?

Currency Nagar Movie Review: ఉన్నతి ఆర్ట్స్ బ్యానర్ పై ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ నిర్మిస్తున్న చిత్రం కరెన్సీ నగర్. యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమా ద్వారా వెన్నెల కుమార్ పోతేపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఆంతాలజీ థ్రిల్లర్ నేపథ్యంలో డిసెంబర్ 29న థియేటర్స్ లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.

కథ:
 సత్య (సుదర్శన్) కు ఐదు లక్షల రూపాయలు అవరసం అవుతాయి. దొంగతనం చేసి అయినా సరే డబ్బు సంపాదించాలని అనుకుంటాడు. ఈ క్రమంలో ఒక చోట బంగారం ఉందని తెలుసుకున్న సత్య అక్కడికి వెళతాడు, అక్కడ సత్యకు ఒక విచిత్రమైన సంఘటన ఎదురవుతుంది. మాట్లాడే ఒక ఇనుప పెట్టలో బంగారం ఉంటుంది, ఆ బంగారం తీసుకోవాలనే క్రమంలో.. ఇనుము పెట్ట సత్యతో మూడు కథలు చెబుతుంది. అందులో మొదటి కథ మానవ సంబంధాల గురించి, రెండో కథ ప్రేమ , మోసం గురించి, మూడో కథ అమ్మాయి ప్రేమను దక్కించుకోవడం కోసం అబ్బాయి చేసే తప్పులు.. ఇలా మూడు కథలు విన్న తరువాత సత్య ఏం చేశాడు ? అతను అసలు అక్కడికి ఎందుకు వెళ్ళవలసి వచ్చింది? అతనికి కావాల్సిన ఐదు లక్షలు దొరికాయా ? నిజంగానే ఇనపెట్టే మాట్లాడిందా ? వంటి విషయాలు తెలియాలంటే కరెన్సీ నగర్ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
నటీనటులు యడ్లపల్లి మహేష్, స్పందన సోమన, కేశవ, రాజశేఖర్, చాందిని , సుదర్శన్, గౌతమ్ వారి పాత్రల పరిధి మేరకు బాగా నటించారు. నిర్మాతలు ముక్కాముల అప్పారావు , డా కోడూరు గోపాల కృష్ణ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. సినిమా రిచ్ గా మంచి టెక్నీకల్ వ్యాల్యూస్ తో ఉంది. దర్శకుడు వెన్నెల కుమార్ పోతేపల్లి తాను తీసిన మొదటి సినిమానే అయినా చాలా అద్భుతంగా తీశాడు. తాను రాసుకున్న కథను తెరమీద చక్కగా చూపించాడు. సంగీతం అందించిన సిద్ధార్థ్ సదాశివుని, పవన్ పాటలతో పాటు నేపధ్య సంగీతం బాగా అందించారు, సినిమాకు ప్లస్ అయ్యింది. ఎడిటర్ కార్తిక్ కట్స్ వర్క్ నీట్ గా ఉంది. అలాగే సినిమాటోగ్రఫీ సతీష్ రాజబోయిన కెమెరా వర్క్ సూపర్బ్, విజువల్స్ బాగున్నాయి.

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

కేశవ , చాందిని ఎపిసోడ్ సినిమాకు బాగా వర్క్ ఔట్ అయ్యింది. మొదటి కథ "పెయిన్" లో అమ్మ క్యారెక్టర్ చిన్నది అయినా బాగా వర్కౌట్ అయింది. ప్రీ క్లైమాక్స్ సినిమాకు మెయిన్ ప్లస్. క్లైమాక్స్ ఎవ్వరూ ఊహించని విధంగా ఉంటుంది. ఇలాంటి కథ, కథనాలతో థియేటర్ లో వచ్చిన మొదటి సినిమాగా కరెన్సీ నగర్ గా చెప్పుకోవచ్చు. అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే విధంగా దర్శకుడు వెన్నెల కుమార్ ఈ సినిమాను తెరకెక్కించారు. కథ చూస్తుంటే మన చిన్నప్పుడు చదివిన బేతాళ కథలు గుర్తుకు వస్తుంది కానీ కథలు మాత్రం చాలా కొత్తగా ఉన్నాయి. తెరమీద చూసి అనుభూతి చెందాల్సిన సినిమా కరెన్సీ నగర్.

రేటింగ్: 2.5

Also read: Raw Milk Benefits: రోజూ రాత్రి వేళ పచ్చిపాలు ఇలా రాస్తే.. ముఖం నిగనిగలాడుతూ మెరిసిపోవడం ఖాయం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News