Mercury Retrograde 2024: అన్ని గ్రహాలు ఒకానొక సమయంలో తిరుగమనం చేస్తూ ఉంటాయి. అయితే 2024 సంవత్సరంలో భూదాగ్రహం తిరోగమనం చేయబోతున్నాడు. ఈ గ్రహ తిరోగమనం చాలామంది చాతకాలపై ప్రభావితం చేస్తుంది. ఈ గ్రహం తీరుగమనం కారణంగా కొన్ని రాశుల వారికి ప్రయోజనాలు కలిగితే మరికొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. ప్రతినెల బుధ గ్రహం సంచారం చేస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో మాత్రమే ఈ గ్రహం ప్రత్యేకంగా సంచారం చేస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అయితే జనవరి 2వ తేదీన బుధుడు ప్రత్యక్షంగా సంచారం చేయబోతున్నాడు. దీని కారణంగా కొన్ని రాశుల వారిపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు.
బుధ గ్రహం తిరుగమనం చేసే క్రమంలో కొన్నిసార్లు ఈ గ్రహ కదలికలు భూమికి అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి దీనికి కారణంగా కొన్ని వారాల పాటు భూమిపై జీవించే కొన్ని రాశుల వారికి తీవ్ర దుష్ప్రభావాలు కలుగుతాయి. అయితే 2024 సంవత్సరంలో బుధుడు చేయబోయే ప్రత్యక్ష తిరోగమనం కారణంగా ఏయే రాశుల వారు ప్రభావితులవుతారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
రాబోయే కొత్త సంవత్సరంలో బుధ గ్రహం ఏప్రిల్ ఒకటి నుంచి ఏప్రిల్ 24 వరకు తిరోగమన దశలో ఉంటుంది ఈ తిరోగమన మేషరాశిలో జరగబోతోంది కాబట్టి ఈ సమయంలో వీరు తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది ముఖ్యంగా నిర్ణయాలు తీసుకునే క్రమంలో ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా మాట్లాడే క్రమంలో కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది ముఖ్యంగా మాటలను నియంత్రించుకోవడం చాలా మంచిదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మేష రాశి వారు ఈ సమయంలో వినాయకుడిని పూజించడం వల్ల మంచి లాభాలు పొందుతారు. అనుకోకుండా గాయాల పాలయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి.
ఇదే ఏడాది ఆగస్టు 4 నుంచి 27వ తేదీ వరకు బుధుడు మూడోసారి తిరోగమనం చేస్తాడు. ఈ సమయంలో బుధ గ్రహం సింహరాశిలో తిరోగమనం చేయడం కారణంగా సింహ రాశి వారికి అనేక సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా ఈ సమయంలో జీవితం కొంత సవాలుగా అనిపిస్తుంది. అంతేకాకుండా ఇతరుల నుంచి ప్రశంసలు కూడా పొందుతారు. ప్రేమ జీవితంలో చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు.
ఆ తర్వాత బుధ గ్రహం నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ధనస్సు రాశిలో తెరోగామనం చేయబోతోంది. ఈ తిరోగమనం కారణంగా ధనస్సు రాశి వారికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అంతే కాకుండా పనుల్లో తీవ్ర ఆటంకాలు కూడా ఎదురవుతాయి అవసరమైన వాదనలు చేయడం మానుకుంటే చాలా మంచిది గొడవలు కూడా పెరుగుతాయి. కాబట్టి ఈ తిరోగమన సమయంలో తప్పకుండా పలు జాగ్రత్తలు పాటించాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook
Mercury Retrograde 2024: బుధ గ్రహం తిరోగమనం ఎఫెక్ట్..2024లో ఈ 3 రాశులవారికి కష్టాలు తప్పవు!