#Mayalo Movie: రొమాంటిక్ ఎంటర్‌టైనర్ '#మాయలో'.. ఆడియన్స్ మదిలో నిలిచిపోయిందా..?

#Mayalo Movie Review and Rating: మోడ్రన్ యూత్‌ను ఆకట్టుకునేలా మిత్ర పేర్వార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ #మాయలో. శుక్రవారం ఈ సినిమా థియేటర్లలో విడుదలైంది. ఈ మూవీ ఆడియన్స్‌ను ఆకట్టకుందా..? ఎవరు ఎలా నటించారు..? పూర్తి వివరాలు రివ్యూలో చూద్దాం..  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 16, 2023, 09:14 AM IST
#Mayalo Movie: రొమాంటిక్ ఎంటర్‌టైనర్ '#మాయలో'.. ఆడియన్స్ మదిలో నిలిచిపోయిందా..?

#Mayalo Movie Review and Rating: యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన మూవీ '#మాయలో'. నరేష్ అగస్త్య, భావన, జ్ఞానేశ్వరి, ఆర్‌జే హేమంత్ ప్రధాన పాత్రల్లో పోషించిన ఈ సినిమాకు మేఘా మిత్ర పేర్వార్ దర్శకత్వం వహించారు. ఫ్రేమ్‌ బై ఫ్రేమ్ పిక్చర్స్‌ పై షాలిని నంబు, రాధా కృష్ణ నంబు సంయుక్తంగా నిర్మించారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన మూవీ శుక్రవారం ఆడియన్స్ ముందుకు వచ్చింది. మరీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించిందా..? యూత్‌కు కనెక్ట్ అయిందా..? రివ్యూలో పరిశీలిద్దాం..
 
కథ ఏంటంటే..?

మాయ (జ్ఞానేశ్వరి), క్రిష్ అలియస్ శివ్ కృష్ణ (నరేష్ అగస్త్య), సింధు (భావన) చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. వీరంతా చిన్నప్పటి నుంచి కలిసి పెరగడంతో ముగ్గురి మధ్య మంచి బాండింగ్ ఉంటుంది. మాయ తాను ప్రేమించిన అబ్బాయిని వివాహం చేసుకునేందుకు రెడీ అవుతుంది. తన పెళ్లిని రావాలని క్రిష్, సింధులను ఆహ్వానిస్తుంది మాయ. ఓ కారును అద్దెకు తీసుకుని క్రిష్, సింధు పెళ్లికి బయలుదేరుతారు. కారులో వీరిద్దరి ప్రయాణం ఎలా సాగింది..? క్రిష్, మాయల మధ్య ఉన్న రిలేషన్ ఏంటి..? బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్న మాయ, సింధు ఎందుకు వీడిపోయారు..? అనేది తెలుసుకోవాలంటే #మాయలో మూవీ చూడాల్సిందే.

విశ్లేషణ

మోడ్రన్ యూత్‌ను టార్గెట్ చేసుకుని డైరెక్టర్ కథ రాసుకున్నాడు. ఇటీవల ఇలాంటి సినిమాలు ఓటీటీలో వస్తుండగా.. #మాయలో వెండితెరపై అలరించేలా తీర్చిదిద్దాడు. రొమాంటిక్ ఎంటర్‌టైనర్ జానర్‌ను ఎంచుకుని.. స్క్రీన్ ప్లేకి డైలాగ్స్ రూపంలో మసాలా జోడించి నవ్వులు పూయించడంలో సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. ఈ మూవీ ఎక్కువగా రోడ్డు ప్రయాణంలో సాగుతుంటుం. నరేష్ అగస్త్య, భావనల మధ్య వచ్చే సీన్లు ఎక్కడా బోర్ కొట్టకుండా డైరెక్టర్ చక్కగా నడిపించాడు. 

ఎవరు ఎలా నటించారంటే..?

మత్తు వదలరా, పంచతంత్ర చిత్రాలతో ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నరేష్ అగస్త్య. ఈ మూవీలో కూడా తన మార్క్‌ నటనతో మెప్పించాడు. భావనతో కెమెస్ట్రీ బాగా సెట్ అయింది. రోడ్డు ప్రయాణంలో టామ్ జెర్రీ గుర్తొచ్చేలా యాక్ట్ చేసి ఆకట్టుకున్నారు. మాయ పాత్రలో జ్ఞానేశ్వరి తన నటనతో మెస్మరైజ్ చేసింది. క్లైమాక్స్‌లో భావనతో పోటీపడి నటించింది. చివర్లో వచ్చే డైలాగ్స్ యూత్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. RJ హేమంత్ పోలీస్ పాత్రలో కాసేపు కనిపించినా.. ఆడియన్స్‌ను మెప్పించాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధి మేర నటించారు. 

రొమాంటిక్ ఎంటర్‌టైనర్ #మాయలో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ముగ్గురు ఫ్రెండ్స్ మధ్య జరిగే రొమాంటిక్ కామెడీని వెండితెరపై చక్కగా ఆవిష్కరించారు. నిర్మాణ విలువలు రిచ్‌గా ఉన్నాయి. ఎడిటింగ్ వర్క్ బాగుంది. మ్యూజిక్ పర్వాలేదనిపస్తుంది. సరదాగా వీకెండ్‌లో #మాయలో సినిమాను చూసేయండి. 

రేటింగ్: 2.75

Also Read: Bank Alerts: డిసెంబర్ 31లోగా బ్యాంకుకు వెళ్లి ఈ పని పూర్తి చేయకుంటే ఇబ్బందులు తప్పవు

Also Read: KCR Discharge: కోలుకున్న కేసీఆర్, యశోద ఆసుపత్రి నుంచి ఇంటికి డిశ్చార్జ్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News