Coconut Water Benefits: డయాబెటిస్ కంట్రోల్‌ కు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..?

Incredible Benefits With Coconut Water: కొబ్బరి నీళ్లు  ప్రతిరోజు తీసుకోవడం కారణంగా డీహైడ్రేషన్‌, గొంతు ఎండిపోవడం, అలసట, తలనొప్పి ఇతర సమస్యల నుంచి ఉపశనం పొందవచ్చని ఆరోగ్యనిపుణులు అంటున్నారు. అంతేకాకుండా సులువుగా బరువు పెరిగే వారు దీని తీసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారని చెబుతున్నారు. ఇలాంటి మరి కొన్ని అద్భుతమైన లక్షణాల గురిచి వెంటనే మీరు కూడా తెలుసుకోండి ఇలా

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 15, 2023, 05:01 PM IST
Coconut Water Benefits: డయాబెటిస్ కంట్రోల్‌ కు కొబ్బరి నీళ్లు తాగుతున్నారా..?

Incredible Benefits With Coconut Water: వేసవికాలంలో చాలా మంది ఎండల కారణంగా డీహైడ్రేషన్‌, గొంతు ఎండిపోవడం, అలసట, తలనొప్పి వంటి బారిన పడుతుంటారు. ఆ సమయంలో ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు.  కొబ్బరి నీళ్ళు త్రాగడం కారణంగా శరీరం డీహైడ్రేషన్‌ నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే కొబ్బరి నీళ్ళు కేవలం వేసవికాలంలోనే కాకుండా ప్రతిరోజు తీసుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్ళు తీసుకోవడంతో పలు ఆరోగ్య సమస్యల నుంచి విముక్తి  పొందవచ్చని తెలుస్తోంది. అయితే కొబ్బరి నీళ్ళు ఎప్పుడు త్రాగవచ్చు..?వీటిని తీసుకోవడం ద్వారా కలిగే ప్రయోజనాలు ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం

ప్రతిరోజు ఒక గ్లాసు కొబ్బరి నీళ్ళు తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు ఉన్నాయి. దీని కారణంగా అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారు సులభంగా బరువు తగ్గచని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దిని ప్రతి రోజు తీసుకోవడం వల్ల చర్మపై వచ్చే మొటిమలు రానివ్వకుండా చేస్తుంది. ఇవే కాకుండా మరీ కొన్ని ప్రయోజనాలు గురించిన తెలుసుకుందాం

శరీరాకి అధిక పొటాషియం లభిస్తుంది: 

పొటాషియం కలిగిన పదార్థాల్లో ఒకటి కొబ్బరికాయ. దీని తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. అంతేకాకుండా లివర్‌న్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.

జీర్ణక్రియ సంబంధించిన సమస్య నుంచి విముక్తి :

జీర్ణక్రియ సమస్యతో బాధపడుతున్న వారు ప్రతి రోజు ఒక్క గ్లాస్ కొబ్బరి నీరు త్రాగడం వల్ల జీర్ణవ్యస్థ మెరుగు పడుతుంది. మలబద్ధకం సమస్యకు చెక్‌ పెట్టవచ్చు. కొబ్బరి నీళ్లలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి.

Also read: Nabhi Marma: నాభి మర్మం అంటే ఏమిటో తెలుసా? దీని వల్ల కలిగే లాభాలు..

గర్భిణులకు ఇది మేలు చేస్తుంది..

కడుపుతో ఉన్నవారు  కొబ్బరి నీళ్లు తాగితే మంచిదని నిపుణులు అంటున్నారు. కొబ్బరి నీళ్లలో ఉండే విటమిన్‌ బి9 కడుపులోని బిడ్డ ఎదుగుదలకు సహయపడుతుంది. ప్రెగ్నెన్సీ సమయంలో  వచ్చే  జీర్ణ సమస్యలు కూడా తగ్గిపోతాయి. 

డయాబెటిస్ కంట్రోల్‌లో ఉంటుంది..

కొబ్బరి నీళ్లు తాగితే  రక్తంలోని షుగర్‌  లెవెల్స్ పెరుగుతాయని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ కొబ్బరి నీళ్లు షుగర్‌  లెవెల్స్ ని తగ్గంచడంలో సాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. 

Also read: Healthy Foods: నూరేళ్ల ఆరోగ్యం కోసం ప్రతిరోజు ఈ ఆహారాలు తింటే చాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News