ICC Player Of The Month Award: వరల్డ్ కప్ ఫైనల్ హీరో, ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు ఎంపికయ్యాడు. భారత్ వేదికగా జరిగిన వరల్డ్ కప్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్‌ల్లో ట్రావిస్ హెడ్ అదిరిపోయే పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. రెండు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ అవార్డులను గెలుచుకున్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో 62 పరుగులు చేయడంతోపాటు రెండు కీలక వికెట్లు తీశాడు. భారత్‌తో జరిగిన ఫైనల్లో 137 పరుగులతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఐసీసీ అవార్డు కోసం మహ్మద్ షమీ, గ్లెన్ మ్యాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్ పోటీ పడ్డారు. చివరకు క్రికెట్ అభిమానులు ట్రావిస్ హెడ్కే ఎక్కువ ఓట్లు వేయడంతో ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు దక్కించుకున్నాడు.
టీమిండియా ఫైనల్‌కు చేరుకోవడంతో పేసర్ మహ్మద్ షమీ కీ రోల్ ప్లే చేశాడు. జట్టుతో ఆలస్యంగా చేరినా.. వికెట్ల వేటలో దూసుకుపోయాడు. 24 వికెట్లతో విశ్వకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు. శ్రీలంక, కివీస్ జట్లపై ఐదు వికెట్లతో చెలరేగాడు. దీంతో ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డుకు నామినేట్ అయ్యాడు.
ప్రపంచ కప్ చరిత్రలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఇన్నింగ్స్ ఆడాడు గ్లెన్ మ్యాక్స్‌వెల్. సెమీస్ చేరాలంటే తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై విశ్వరూపం ప్రదర్శించాడు. కీలక బ్యాట్స్‌మెన్ అంతా పెవిలియన్‌కు చేరుకున్నా.. గాయాలు ఇబ్బంది పెడుతున్నా ఒంటి చెత్తో ఆసీస్‌కు అద్బుత విజయాన్ని అందించాడు. 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా పయనిస్తున్న జట్టు 292 పరుగుల లక్ష్యాన్ని ఛేదించిందంటే అది మ్యాక్సీ సూపర్ ఇన్నింగ్సే కారణం. ఆ తరువాత టీమిండియాతో జరిగిన టీ20 సిరీస్‌లో ఈ స్టార్ ఆల్‌రౌండర్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 48 బంతుల్లో సెంచరీ బాది ఆసీస్‌ను గెలిపించాడు.
ఈ ముగ్గురు ఆటగాళ్లు రేసులో నిలబడగా.. ఐసీసీ ఓటింగ్ అకాడమీ, అభిమానులు వేసిన ఓట్ల ఫలితంగా ట్రావిస్ హెడ్‌ను ప్లేయర్ ఆఫ్ మంత్ అవార్డు వరించింది. మొత్తం ఓట్ల విలువలో 90 శాతం ఐసీసీ ఓటింగ్ అకాడమీకి 90 శాతం.. అభిమానులకు 10 శాతం ఓటు షేర్ ఉంటుంది. మహిళల విభాగంలో బంగ్లాదేశ్ ప్లేయర్ నహిదా అక్తెర్ అవార్డును కైవసం చేసుకుంది.
Also Read: Alla Ramakrishna Reddy: వైసీపీకి బిగ్‌షాక్.. పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా
Also Read: Allu Arjun: హాయ్ నాన్న రివ్యూ ఇచ్చేసిన అల్లు అర్జున్.. నానిపై ప్రశంసలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి