Madhave Madhusudana Movie Review: అద్భుతమైన క్లైమాక్స్..మాధవే మధుసూదన సినిమా రివ్యూ..

Madhave Madhusudana Movie Review: అద్భుతమైన క్లైమాక్స్‌తో ప్రేమ కథా చిత్రంతో రూపొందిన సినిమా మాధవే మధుసూదన..ఈ చిత్రం నవంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీకి సంబంధించి రివ్యూ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 24, 2023, 07:25 PM IST
 Madhave Madhusudana Movie Review: అద్భుతమైన క్లైమాక్స్..మాధవే మధుసూదన సినిమా రివ్యూ..

Madhave Madhusudana Movie Review:  లవ్ స్టోరీ కలిగిన మూవీస్ కి ఎప్పుడు మంచి ఆదరణే లభిస్తుంది. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో తప్పకుండా ఏదైనా ఓ పార్ట్ లో ప్రేమ సన్నివేశాలు ఉండాల్సిందే. అంతేకాకుండా ప్రస్తుతం ప్రేక్షకులు ఎక్కువగా క్లైమాక్స్ సీన్లను ఇష్టపడుతున్నారు. అలాంటి నేపథ్యంలోనే వచ్చిన సినిమా మాధవే మధుసూదన. ఈ చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..ఓ అందమైన ప్రేమ కథ చిత్రం.  ప్రేక్షకులు ఈ అందమైన ప్రేమ గత చిత్రాన్ని మనసుకు హత్తుకునేలా బొమ్మదేవర రామచంద్ర రావు తీశారు. ఈ చిత్రంలో హీరోగా తేజ్ బొమ్మదేవర, హీరోయిన్ గా రిషికి లొక్రే నటించారు.. ఇప్పుడు ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నవంబర్ 24వ తేదీన వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో? ఈ సినిమాకుల ప్రేక్షకుల నుంచి లభించిన రేటింగ్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కథ:
సినిమాకు సంబంధించిన కథ వివరాల్లోకి వెళితే.. తేజ్ బొమ్మ దేవర మాధవ్ పాత్రలో కనిపిస్తారు. ఈ మాధవ్ రవి (జోష్ రవి), శివ (శివ)లతో లైఫ్ను జాలీగా తిరుగుతూ ఎంతో ఎంజాయ్ చేస్తూ గడుపుతూ ఉంటారు. ఇలా తిరుగుతున్న కొడుకులను చూసి వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో బాధపడుతూ ఉంటారు. అయితే ఇంతలోనే మాధవ తల్లి (ప్రియ) తమకున్న ఆఫీస్ బాధ్యతలను చూసుకోవాలని బెంగళూరుకు వెళ్ళమని చెబుతుంది. ఇంతలోనే తన తండ్రి కూడా వచ్చి వెళ్ళమని సలహా ఇస్తాడు. ఇలా తల్లిదండ్రుల మాటను విని ఓకే అని మాధవ్ వైజాగ్లో బెంగళూర్ ట్రైన్ ఎక్కి అరకు చేరుకుంటాడు. అయితే ట్రైన్ లో వెళ్లే మార్గం మధ్యలో ఓ స్టేషన్లో మాధవ్ ఓ అమ్మాయిని(రిషికి లొక్రే) చూస్తాడు. ఆ అమ్మాయి కేవలం మాధవ్ కు మాత్రమే కనిపిస్తుంది. మిగతా ఎవ్వరికి ఆ అమ్మాయి కనిపించదు. అయితే ఈ సినిమాలో ఆ అమ్మాయికి మాధవ్ కి మధ్య ఉన్న సంబంధమేంటో? మాధవ్ ఎందుకు అమ్మాయి వెంట వెళ్తాడో? గతంలో వీరిద్దరు చేసిన త్యాగాలు ఏంటో? అనేది అసలు కథ.

నటీనటీలు:
ఈ సినిమాకి తేజ్ బొమ్మ దేవర మొదటిసారిగా హీరోగా నటిస్తున్నారు. అయినప్పటికీ ఎక్కడ తగ్గకుండా యాక్టింగ్ పరంగా మంచి పర్ఫామెన్స్ అందించాడు. ఆయన అందరు కొత్త హీరోలా కాకుండా ఎంతో న్యాచురల్ గా పాత్రలో లీనమయ్యారు. ఒక గొప్ప ప్రేమికుడిగా జాలిగా తిరిగే అబ్బాయిగా, పక్కింటి కుర్రాడుగా ఎంతగానో మెప్పించాడు. డాన్సులు, డైలాగుల పరంగా ఎక్కడ తగ్గలేదని చెప్పొచ్చు. ఇక హీరోయిన్ విషయానికొస్తే రిషికి అందర్నీ ఎంతగానో ఆకట్టుకుంది. సినిమా తెరపై ఎంతో చలాకీగా కనిపించిందని చెప్పవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ తండ్రిగా బొమ్మదేవర రామచంద్రరావు తన ఎమోషనల్ సీన్లతో అందరి గుండెల్లో నిండిపోయాడు. ఇక స్నేహితుల పాత్రల విషయానికొస్తే ఎంతో నవ్వు పూయించాయి.

విశ్లేషణ:
మాధవే మధుసూదనా అనే టైటిల్ ఎంత పాజిటివిటీగా ఉందో మూవీ కూడా అంతే పాజిటివిటీతో విడుదలైంది. ఈ సినిమాలో ఎక్కడ వల్గారిటీ సంబంధించిన పదాలను గాని, పాత్రలను కానీ చూపించలేదు. ఎలాంటి నెగెటివిటీ సీన్లకు వెళ్లకుండా తనకు కావాల్సిన సీన్లను మాత్రమే చూపించాడు దర్శకుడు. ఈ విషయంలో తప్పకుండా దర్శకుడిని మెచ్చుకోవాల్సిందే. కథ కథనాలు ఎన్నో ఉన్నా ఏమాత్రం గాడి తప్పకుండా ఈ సినిమా పాత్రలను చూపించారు.

ప్రేమ అంటే సమస్యలు రావడం సంఘర్షణలు జరగడం కామన్.. కానీ ఏర్పడే సమస్యలు జరిగే జరిగే సంఘర్షణలు ఎవరితో..ఎవరి మధ్య అనేదే ఎంతో ఇంపార్టెంట్. అక్కడే ప్రతి మూవీ మూవీకి తేడా ఉంటుంది. అన్ని లవ్ స్టోరీలు ఒకే లాగా ఉండవు. సినిమాలో విలన్ అనేవాడు ప్రత్యేకంగా ఉంటాడు. అంతేకాకుండా కొన్నికొన్ని సందర్భాల్లో విధి విలన్ గా కూడా కనిపిస్తుంది. ప్రియురాలికి ఇచ్చిన మాట కోసం ప్రియుడు ఏం చేశాడు? ఏం చేయగలడు? లేకుంటే ప్రేయసి ఎలా ఉంటుంది? అనేది ఈ సినిమాలో చక్కగా చూపించారు.

రేటింగ్: 2.75

 

Also Read: CM Jagan Mohan Reddy: 10,511 జంటలకు రూ.81.64 కోట్ల లబ్ధి.. అకౌంట్‌లోకి డబ్బులు జమ  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News