Ram Charan: వరుణ్ తేజ్ వెడ్డింగ్ లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Ram Charan Watch cost: ప్రస్తుతం రామ్ చరణ్ వరుణ్ తేజ్ పెళ్లి వేడుకల్లో బిజీగా ఉన్నారు. ఇక ఈరోజు ఉదయం ఈ పెళ్లి వేదిక నుంచి రామ్ చరణ్ తన బాబాయి పవన్ కళ్యాణ్ తో తీసుకున్న ఒక ఫోటో మెగా అభిమానుల దృష్టిని తెగ ఆకట్టుకుంది. కాదా ఈ ఫోటోలో రామ్ చరణ్ వేసుకున్న వాచ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్త అందరిని ఆశ్చర్యపరిస్తోంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 3, 2023, 11:00 PM IST
Ram Charan: వరుణ్ తేజ్ వెడ్డింగ్ లో రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా?

Ram Charan : రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రామ్ చరణ్ ప్రఖ్యాతి ప్రపంచం మొత్తం వ్యాపించింది. ప్రస్తుతం ఈ మెగా హీరో అంటే తెలియని వారు ఎవరు ఉండరు. అందుకే ఈ హీరో ఏమి చేసిన, ఏమి వేసుకున్న అది ఒక పెద్ద వార్త గానే మిగులుతుంది. కాగా ప్రస్తుతం రామ్ చరణ్ తన ఫ్యామిలీతో తన తమ్ముడు వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఇటలీకి వెళ్ళిన సంగతి తెలిసిందే. దాదాపు 5 రోజులు అనేక ఈవెంట్స్ తో రంగ రంగ వైభవంగా వరుణ్ తేజ్ పెళ్లి వేదికలు కొనసాగాయి.

వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి.. ఈ బుధవారం (నవంబర్ 1) ఇటలీలోని టస్కనీలో పెళ్లి బంధంతో ఒకటయ్యారు. ఈ వివాహ వేడుకకు మెగా కాంపౌండ్ హీరోలు.. అలానే వారి ఫ్యామిలీ వారు అందరూ హాజరయ్యారు. కాదా ఈ పెళ్లికి సంబంధించిన ఎన్నో ఫోటోలు ప్రస్తుతం ఈ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ఫోటోలు అన్నిటికన్నా కూడా ఈరోజు ఉదయం బాబాయ్ పవన్ కళ్యాణ్, అబ్బాయి రామ్ చరణ్ కలిసి ఉన్న ఫోటో అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది.

వీరిద్దరూ కలిసి కనిపించిన ఫోటోలు చాలా తక్కువ ఉండడంతో.. బాబాయి.. అబ్బాయి ఇద్దరు సరదాగా నవ్వుతూ నడుస్తూ ఉండే ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటో చూసి మెగా అభిమానులు తెగ మురిసి పోతున్నారు. కాగా ఆ పిక్ లో బాబాయ్, అబ్బాయి ధరించిన వస్తువులను కూడా చాలా బాగా పరిశీలిస్తున్నారు.  ముఖ్యంగా ఈ ఫోటోలో రామ్ చరణ్ వేసుకున్న వాచ్ కాస్ట్ అందరినీ షాక్ కు గురి చేస్తోంది.

ముందుగా రామ్ చరణ్ వేసుకున్న వాచ్ ని పరిశీలించిన అభిమానులు ఆ కాస్ట్ గురించి గూగుల్ లో సెర్చ్ చేయగా అందుకు వచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యపరిచింది. అసలు విషయానికి వస్తే రామ్ చరణ్ పెట్టుకున్న వాచ్ పెటక్ ఫిలిప్పీ మోడల్ అంట. దాని ఖరీదు అక్షరాల 285000 డాలర్స్. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2 కోట్ల 85 లక్షల. ఈ ఖరీదు తెలుసుకున్న వారు షాక్ అవుతున్నారు. మామూలుగా కూడా రామ్ చరణ్ వాచ్లను ఎక్కువ ఇష్టపడుతుంటారని పలుమార్లు ఇంటర్వ్యూ లో చెప్పకొచ్చారు. ఇంతకుముందు కూడా కొన్నిసార్లు రామ్ చరణ్ ధరించిన వాచ్ కాస్ట్లు అందరిని ఆశ్చర్యపరిచాయి. ఇక ఇప్పుడు మరోసారి తన వాచ్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు ఈ హీరో.

 

Also Read: Lava Blaze 2 5G Price: Lava నుంచి మార్కెట్‌లో అరుదైన మొబైల్‌..ఫీచర్స్‌ చూస్తే ఆశ్చర్యపోతారు!

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News