Dragon Fruit For Skin: డ్రాగన్ ఫ్రూట్ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. ఈ ఫ్రూట్‌లో ఉండే పోషకాలు శరానికి చాలా రకాలుగా సహాయపడుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఐరన్, కాల్షియం వంటి పోషకాలు తీవ్ర అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయి. ఇందులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు కూడా అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు డ్రాగన్ ఫ్రూట్‌ను తీసుకోవడం వల్ల ఆర్థరైటిస్ నొప్పిల నుంచి కూడా విముక్తి కలిగిస్తుంది. అంతేకాకుండా దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడకుండా రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. తరచుగా రక్తహీనత వంటి సమస్యలతో బాధపడేవారికి కూడా ఈ ఫ్రూట్ ప్రభావంతంగా సహాయపడుతుంది. అయితే ఇందులో ఉండే గుణాలు చర్మానికి కూడా చాలా ప్రభావంతంగా సహాయపడుతుంది. ఈ ఫ్రూట్ వల్ల చర్మానికి కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ముఖం తేమగా మారుతుంది:
డ్రాగన్ ఫ్రూట్‌లో హైడ్రేటింగ్ గుణాలు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి ప్రతి రోజు ఈ పండును తినడం వల్ల ముఖంపై తేమ పెరుగుతుంది. అంతేకాకుండా చర్మం హైడ్రేట్‌గా మారుతుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.
యాంటీఆక్సిడెంట్ లక్షణాలు:
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఆక్సిడెంట్ గుణాలతో పాటు విటమిన్ సి కూడా అధిక మోతాదులో లభిస్తాయి. ఇందులో ఉండే గుణాలు చర్మాన్ని దెబ్బతినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా చర్మాన్ని యవ్వనంగా చేస్తుంది. దీంతో పాటు ముడతలు, ఫైన్ లైన్స్ వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
మెరిసే చర్మం కోసం:
డ్రాగన్ ఫ్రూట్‌ను ఫేస్ మాస్క్‌లాగా కూడా వినియోగించవచ్చు. దీనిని ఫేస్ మాస్క్‌లా వినియోగించడం వల్ల చర్మం మెరిసేలా తయారవుతుంది. అంతేకాకుండా దీని నుంచి సహజమైన నిగారింపు కూడా పొందుతారు.
శోథ నిరోధక లక్షణాలు లభిస్తాయి:
డ్రాగన్ ఫ్రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. దీనిని ముఖానికి వినియోగించడం వల్ల చర్మాన్ని ప్రశాంతంగా, మృదువుగా మారుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకుండా ముఖం ఎరుపు రంగులోకి మారకుండా సహాయపడుతుంది.
ఇది కూడా చదవండి : Telangana, AP Weather Updates: రెయిన్ అలర్ట్.. మరో నాలుగు రోజుల పాటు వర్షాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి