Mohammed Shami Gets Bail: వరల్డ్ కప్‌కు ముందు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ షమీకి బిగ్ రిలీజ్ లభించింది. షమీ భార్య హసిన్ జహాన్ దాఖలు చేసిన గృహ హింస కేసులో అలీపూర్‌లోని ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షమీ అన్నయ్య మహ్మద్ హసీబ్‌కు కూడా కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మంగళవారం విచారణ సందర్భంగా తన సోదరుడితో కలిసి షమీ కోర్టుకు హాజరయ్యాడు. షమీ తరపు న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా.. కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రపంచకప్‌కు 15 రోజుల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో షమీకి బెయిల్ లభించడంతో ఆటపై మరింత దృష్టిపెట్టేందుకు అవకాశం ఏర్పడింది.
2018లో తనపై వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ మహ్మద్ షమీతో పాటు అతడి సోదరుడిపై హసిన్ జహాన్ జాదవ్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. 2019లో అలీపూర్ ఏసీజేఎం కోర్టు షమీపై అరెస్ట్ వారెంట్ జారీ చేయగా.. అదే ఏడాది అలీపూర్ జిల్లా సెషన్స్ కోర్టు అరెస్ట్ వారెంట్‌పై స్టే విధించింది. దీంతో ఈ కేసు అప్పటి నుంచి అలాగే పెండింగ్‌లో ఉంది. షమీపై ఉన్న స్టేను ఎత్తివేయాలని హసిన్ జహాన్ మరోసారి కోర్టు మెట్లు ఎక్కింది. ఇటీవల సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. షమీకి ఇతర మహిళలతో అక్రమ సంబంధాలు ఉన్నాయని.. ఇప్పటికీ కొనసాగిస్తున్నాడని ఆమె ఆరోపిస్తోంది.
ఈ కేసులో విచారణ ప్రారంభమైన తర్వాత తొలిసారిగా షమీ మంగళవారం మధ్యాహ్నం కోర్టుకు వ్యక్తిగతంగా హాజరయ్యాడు. షమీ తరఫు న్యాయవాది సలీం రెహమాన్ మాట్లాడుతూ.. 'షమీ, అతని సోదరుడిపై పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఛార్జ్ షీట్ సమర్పించిన తర్వాత ఎవరైనా కోర్టుకు హాజరై బెయిల్ కోరాలని చట్టంలో ఉంది. దీని ప్రకారం మేము ఈరోజు కోర్టు ముందు హాజరుపరిచి బెయిల్‌కు అప్పీల్ చేశాం. అన్నదమ్ములిద్దరికీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. చట్టం ప్రకారం షమీ ఇక నుంచి ఈ కేసులో జరగబోయే న్యాయ విచారణలో పాల్గొంటాడు." అని తెలిపారు.
ఇటీవల ఆసియా కప్‌లో ఆడిన మహ్మద్ షమీ.. భారత్‌కు తిరిగి వచ్చిన వెంటనే కోర్టుకు హాజరయ్యాడు. కోర్టు బెయిల్ లభించడంతో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్‌తోపాటు భారత్ వేదికగా ఆరంభమయ్యే విశ్వ కప్‌లో షమీ ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడనున్నాడు. కాగా.. ఆసియా కప్‌లో ఎక్కువగా ఆడే అవకాశం లభించలేదు.
Also Read: Janasena Glass Symbol: జనసేనకు గుడ్‌న్యూస్.. గాజు గ్లాస్ గుర్తు వచ్చేసింది
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. డీఏ పెంపు ప్రకటన ఎప్పుడంటే..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook