Bandi Sanjay Letter: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ రిక్వెస్ట్.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ

Bandi Sanjay Write Letter To CM KCR: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ లేఖ రాశారు. నిర్మల్ పట్టణంలో ఈద్గా నిర్మాణం కోసం భూమి కేటాయించిన బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా భూమి కేటాయించడాన్ని ఆయన తప్పుబట్టారు. హిందూ ఆలయాలకు సమీపంలో ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం సరికాదన్నారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 18, 2023, 02:09 PM IST
Bandi Sanjay Letter: సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్ రిక్వెస్ట్.. వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని లేఖ

Bandi Sanjay Write Letter To CM KCR: నిర్మల్ పట్టణంలో వృత్తి నైపుణ్య శిక్షణా కేంద్రం కోసం కేటాయించిన అటవీ భూమిని చట్ట విరుద్ధంగా ఈద్గా నిర్మాణం కోసం కేటాయించిన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత భవిష్యత్‌ పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం భూమి కేటాయించడం చట్ట విరుద్ధమన్నారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కు ఆయన లేఖ రాశారు. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించిన భూములను ఇతర ప్రయోజనాలకు వినియోగించొద్దని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లా చించోలిలో ఈద్గాను నిర్మించడం న్యాయ వ్యవస్థను అవమానించడమే.. ముమ్మాటికీ కోర్టు ధిక్కరణేనని అన్నారు. హిందూ దేవాలయాలకు సమీపంలోనే ఈద్గా ప్రార్థనలకు భూమి కేటాయించడం ప్రజల మధ్య వైషమ్యాలను రెచ్చగొట్టేందుకే అని భావించాల్సి వస్తుందన్నారు.

'నిర్మల్ జిల్లా చించోలి గ్రామంలోని సర్వే నెంబర్ 543, 544, 969 లోని అటవీ భూమిని వృత్తి విద్యా నైపుణ్యాల అభివృద్ధి కోసం కేటాయించాలనే రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థన మేరకు సుమారు 3.373 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. ఆయా అటవీ భూములను సైతం డీనోటిఫై చేసిందే నిరుద్యోగ యువత భవిష్యత్తు కోసం… అటువంటి భూమిని మీ స్వార్ధ రాజకీయాల కోసం ఈద్గా ప్రార్థనల కోసం కేటాయించడం చట్ట విరుద్దం. ప్రజా ఉపయోగ కార్యక్రమాల కోసం ఉపయోగించాల్సిన ప్రభుత్వ భూములను ప్రార్థనా స్థలాలకు కేటాయించడానికి వీల్లేదని ప్రభుత్వ నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. అంతేగాకుండా ఏ ప్రజా ప్రయోజనాల కోసమైతే భూములను కేటాయిస్తారో.. ఆ ప్రజా ప్రయోజనాలకు మాత్రమే సదరు భూమిని వినియోగించాలే తప్ప అందుకు భిన్నంగా ఇతర ప్రయోజనాలకు వినియోగించడం చట్ట విరుద్ధం. 

గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సహా పలు కోర్టులు ఈ మేరకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశాయి. ఈ విషయంలో న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులే పాలకులకు అనుసరణీయం. అయినప్పటికీ కోర్టు తీర్పులకు వ్యతిరేకంగా నిర్మల్ జిల్లాలోని చించోలిలో ఈద్గాను నిర్మించడమంటే న్యాయ వ్యవస్థను అవమానించినట్లే. ఇది ముమ్మాటికీ కోర్టు ధిక్కరణే. రాజ్యాంగాన్ని ధిక్కరించడమే. ప్రజా ప్రయోజనాల కోసం కేటాయించబడిన ఫారెస్ట్ భూములను మీ స్వార్థ రాజకీయాలకు వాడుకోవాలనుకోవడం నీచమైన పని. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం..' అని బండి సంజయ్ అన్నారు. 

Also Read: Minister Harish Rao Speech: బీజేపీ ఎన్ని ట్రిక్స్ ప్లే చేసినా.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం: మంత్రి హరీష్‌ రావు ధీమా   

ఓట్ల కోసం విద్యార్థుల ప్రయోజనాలను పక్కనపెట్టి ఒక మతానికి కొమ్ము కాసేలా నిర్ణయాలు తీసుకోవడం మీ స్వార్ధ రాజకీయాలకు పరాకాష్ట అని అన్నారు. చట్ట విరుధ్దమైన భూమిలో ఈద్గా నిర్మాణం ప్రారంభానికి దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ వెళ్తుండటం బాధాకరమన్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం యువత భవిష్యత్తును బలి చేసే చర్యలను బీజేపీ తెలంగాణ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం ,కేంద్ర పర్యావరణ శాఖ ఉత్తర్వులు బేఖాతారు చేసి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళితే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు.

Also Read: OPS Latest Update: ఉద్యోగులకు తీపికబురు.. ఓపీఎస్‌ అమలుకు నోటిఫికేషన్

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News