Kalinga Movie Review: 'కళింగ' మూవీ రివ్యూ.. మూవీ మెప్పించిందా..!

Kalinga Movie Review: ధృవ వాయు గతంలో 'కిరోసిన్' మూవీతో ఆకట్టుకున్నాడు. తాజాగా ఆయనే మెగాఫోన్ చేతబూని హీరోగా చేసిన సినిమానే 'కళింగ' . మరి ఈ సినిమాతో ధృవ వాయు ఆకట్టుకున్నాడా ? లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

Written by - TA Kiran Kumar | Last Updated : Sep 12, 2024, 08:07 PM IST
Kalinga Movie Review: 'కళింగ' మూవీ రివ్యూ.. మూవీ మెప్పించిందా..!

మూవీ రివ్యూ: కళింగ (Kalinga)
నటీనటులు: ధృవ వాయు, ప్రగ్యా నయన్, తనికెళ్ల భరణి,  లక్షణ్ మీసాల, ఆడుకాలం నరేన్, బలగం సుధాకర్, మురళీధర్ గౌడ్, తదితరులు
ఎడిటర్:  నరేష్ వేణువంక 
సినిమాటోగ్రఫర్: అక్షయ్ రామ్ పొదిశెట్టి 
మ్యూజిక్: విష్ణు శేఖర 
నిర్మాత:  దీప్తి కొండవీటి, పృథ్వీ యాదవ్, 
దర్శకత్వం: ధృవ వాయు

ఇప్పటికే 'కిరోసిన్' అనే మూవీతో అట్రాక్ట్ చేసిన నటుడు ధృవ వాయు. ఈ మధ్య కాలంలో అందరు హీరోలు మెగా ఫోన్ పట్టుకొని తమను తాము ప్రమోట్ చేసుకుంటున్నారు.  ఈ కోవలో నటుడు ధృవ వాయు తానే హీరోగా గా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తనే డైరెక్ట్ చేస్తూ తెరకెక్కించిన చిత్రం 'కళింగ'. ఇప్పటికే ఈ సినిమాను పలు చోట్ల ప్రీమియర్స్ వేశారు. 13వ తేది విడుదల కాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించిందా లేదా మన మూవీ రివ్యూలో చూద్దాం.. 

కథ విషయానికొస్తే.. 
'కళింగ' టైటిల్ కు తగ్గట్టే కళింగ అనే ఊర్లో మొదలవుతుంది. అక్కడ లింగ (ధృవ వాయు) ఊర్లో సారాయి కాస్తూ లైఫ్ ను లీడ్ చేస్తుంటాడు. ఆ ఊరికి పెద్ద అయిన (ఆడుకాలమ్ నరేన్), అతని సోదరుడు బలి ఊర్లో కనపడ్డ ఆడదానిపై కన్నేసి కాటేస్తాడు. లింగ చిన్నతనం నుంచి పద్దు (ప్రగ్యా నయన్)ను ప్రేమిస్తూ ఉంటాడు. ఆమె కూడా అతన్ని గాఢంగా ప్రేమిస్తుంది. ఇంతలో ఊరి పెద్ద తమ్ముడు బలి కన్ను పద్దుపై పడుతోంది. ఈ నేపథ్యంలో తన కూతురుతో పెళ్లి కోసం అతనికో షరతు పెడతాడు. తాకట్టులో ఉన్న పొలాన్ని విడిపిస్తే తన కూతరును ఇచ్చి పెళ్లి చేస్తానంటాడు. దీంతో లింగకి సంస్థానంలో స్థలం రాసిస్తాడు. ఆ సంస్థానినిక ఓ శాపం ఉంటుంది. అది ఏమిటి.. ? ఈ నేపథ్యంలో ఆ ఊరిలో ఉన్న  కట్టుబాటులు ఏమిటి.. ? ఆ కట్టుబాటుల వల్ల లింగ ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేసాడనేదే ఈ సినిమా స్టోరీ. 

కథనం, టెక్నికల్ విషయానికొస్తే.. 

ధృవ వాయు  ఈ సినిమాలో హీరోగా నటిస్తూ తనకు ఎలాంటి సబ్జెక్ట్ సూట్ అవుతుందో అలాంటి సబ్జెక్ట్ ను ఎంచుకున్నాడు. అంతేకాదు తాను రాసుకున్న కథను అంతే అద్భుతంగా తెరపై పండించాడు. అందులో దాదాపు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఒక డిఫరెంట్ స్టోరీని రాసుకొని తెరపై అంతే అద్భుతంగా ఎక్స్ క్యూట్ చేసాడు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాల్లో ఆర్ఆర్ తో సినిమాను ఎక్కడికో తీసుకెళ్లాడు. సినిమా స్టార్ట్ అయిన కొన్ని నిమిషాల్లోనే ఆడియన్స్ కథలో లీనమైపోతారు. ముఖ్యంగా ఊరికి ఉన్న శాపం. ఊరి పొలిమేర దాటితే కలిగే అనర్ధాలను చక్కగా ప్రెజెంట్ చేసాడు. ముఖ్యంగా ఊరు సరిహద్దులు దాటిన వాళ్లు ఎందుకు చనిపోతున్నారు. దాని వెనక ఏదైనా అతీత శక్తులున్నాయా.. ? మనుషులే ఇదంతా కావాలనే చేసారా అనేది తెరపై చూడాల్సిందే. ముఖ్యంగా ఈ సినిమాకు ఆర్ఆర్ తర్వాత కెమెరా వర్క్ అద్భుతంగా ఉంది. ఫస్ట్ హాఫ్ వరకు సినిమాపై మంచి పట్టు సాధించిన సెకండాఫ్ లో అదే ఊపు కంటిన్యూ చేయలేకపోయినా.. ఓవరాల్ గా మాత్రం బాగుంది. నిర్మాణ విలువలు అద్భుతంగా ఉన్నాయి. 

నటీనటుల విషయానికొస్తే..
నటుడే దర్శకుడిగా మారితే.. ఎలా ఉంటుందో ధృవ వాయు తన నటనతో ఆకట్టుకున్నాడు. ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడిగా ఎక్స్ ప్రెషన్స్ పలికించాడు. యాక్షన్ సీక్వెన్స్ లో తన పట్టు ఏమిటో చూపించాడు. హీరోయిన్ గా నటించిన ప్రగ్యా నయన్ పర్వాలేదు. విలన్స్ తమ విలనిజాన్ని మరింతగా చేస్తే బాగుండేది. మిగిలిన నటీనటులు తమ పరిధి మేరకు రాణించారు. 

పంచ్ లైన్.. ఆకట్టుకునే సస్పెన్స్ థ్రిల్లర్ 'కళింగ'..

రేటింగ్:3/5

ఇదీ చదవండి:  పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్నా లెజ్నెవా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తెలుసా..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News