Jigel: తెలుగులో మరో కామెడీ థ్రిల్లర్ 'జిగేల్’.. మార్చి 7న గ్రాండ్ రిలీజ్..

Jigel: తెలుగులో  సహా ఇతర భాషల్లో థ్రిల్లర్ జానర్స్ లో తెరకెక్కుతోన్న చిత్రాలకు మంచి గిరాకీ ఉంది. ఈ కోవలో తెలుగులో వస్తోన్న చిత్రం ‘జిగేల్’.  త్రిగుణ్, మేఘా చౌదరి జంటగా నటిస్తూన్న ఈ సినిమాను  మల్లి యేలూరి డైరెక్ట్ చేస్తున్నారు.

Written by - TA Kiran Kumar | Last Updated : Feb 22, 2025, 03:31 PM IST
Jigel: తెలుగులో మరో కామెడీ థ్రిల్లర్ 'జిగేల్’..  మార్చి 7న  గ్రాండ్ రిలీజ్..

Jigel: ఒకప్పుడు తెలుగు తెర హాస్య నటులతో కళ కళలాడేది. కానీ ఇపుడు అది తగ్గిపోయింది. ఇపుడు చాలా కాలం తర్వాత ఫేమస్ హాస్య నటులంతా లీడ్ రూల్స్ లో నటిస్తూన్న చిత్రం ‘జిగేల్’. మాస్ క్లాస్ ఆడియన్స్  అంతా రెండున్నర గంటల పాటు నాన్ స్టాప్ గా ఎంజాయ్ చేస్తారని దర్శక, నిర్మాతలు చెబుతున్నారు. టాప్ ప్రొడక్షన్స్ వాల్యూస్ తో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను నిర్మాతలు గ్రాండియర్ గా నిర్మించారు. ఈ చిత్రాన్ని Dr Y. జగన్ మోహన్, నాగార్జున అల్లం నిర్మించారు.    

ప్రముఖ ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు ఈ సినిమాకి పని చేయడం జరిగింది. ఆనంద్ మంత్ర సంగీతం అందిస్తున్నారు. వాసు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ పని చేస్తున్నారు.  ఇందులో త్రిగుణ్ , మేఘా చౌదరి,రఘు బాబు, పృథ్వీ రాజ్, షాయాజీ షిండే, పోసాని కృష్ణమురళి,మేక రామకృష్ణ, నళిని, మధు నందన్,  ముక్కు అవినాశ్, జయ వాణి,  అశోక్, గడ్డం నవీన్, చందన, రమేష్ నీల్, అబ్బా  టీవీ డా. హరిప్రసాద్ నిర్మించారు. 

ఇదీ చదవండి:   అల్లు అర్జున్ నిజంగానే రామ్ చరణ్ అన్ ఫాలో చేశాడా.. తెర వెనక అసలు స్టోరీ ఇదే.

ఈ సినిమాకు స్టోరీ స్క్రీన్ ప్లే నిర్మాత నాగార్జున అల్లం వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు రమేశ్ చెప్పాల, నాగార్జున అల్లం డైలాగ్స్ రాసారు. ఆనంద్ మంత్ర సంగీతం అందిస్తున్నారు. కోటగరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.  చంద్ర కిరణ్ కొరియోగ్రాఫర్ గా అందిస్తున్నారు.  ఈ సినిమాకు భాస్కర భట్ల, ఆంనద్ మంత్ర లిరిక్స్ అందిస్తున్నారు.

ఇదీ చదవండి: Liquor Rates Hike: మందుబాబుకు భారీ షాక్.. భారీగా పెరిగిన బీర్ల ధరలు..

ఇదీ చదవండి: ప్రభుత్వ ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. బేసిక్ పేలో భారీ పెంపు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News