Good Husband: కాబోయే భార్యకు మీరు గుడ్ హస్బెండా.. బ్యాడ్‌ గుడ్ హస్బెండా.. ఇలా తెలుసుకోండి!

Qualities Of A Good Husband Material: భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు ఉండకుండా ఉండాలంటే ఇద్దరి మధ్య మంచి అనుబంధం ఉండాల్సి ఉంటుంది. ముఖ్యంగా మహిళలు గుడ్ హస్బెండా కోసం ఆలోచిస్తే ఈ లక్షణాలు ఉన్నాయా..? లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. గుడ్ హస్బెండా కి ఉండాల్సి లక్షణాల గురించి తెలుసుకుందాం. 

Written by - Shashi Maheshwarapu | Last Updated : Oct 21, 2024, 05:45 PM IST
Good Husband: కాబోయే భార్యకు మీరు గుడ్ హస్బెండా.. బ్యాడ్‌ గుడ్ హస్బెండా.. ఇలా తెలుసుకోండి!

Qualities Of A Good Husband Material: భార్యాభర్తల మధ్య వాగ్వాదాలు సర్వసాధారణం. కానీ ఒక మంచి భర్తగా ఉండాలంటే ఆ వాగ్వాదాలను తగ్గించే విధానం చాలా ముఖ్యం.  ఒక మంచి భర్త కేవలం ప్రేమను చూపించడమే కాకుండా కొన్ని ముఖ్యమైన లక్షణాలను కూడా అలవర్చుకోవాల్సి ఉంటుంది.  అయితే గుడ్‌ హస్బెండ్‌ కు ఉండాల్సిన లక్షణాలు ఏంటి..? మహిళలు హస్బెండ్‌లో లాంటి లక్షణాలు చూసిన ఇష్టపడుతారు అనే వివరాలు తెలుసుకుందాం. 

ఓపెన్ కమ్యూనికేషన్ అనేది ఆ లక్షణాలలో ఒకటి. ఇది చాలా ముఖ్యమైన అంశం. ఎందుకంటే మనం మన భావాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయకపోతే, అపార్థాలు తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే మన భాగస్వామిని కూడా మన మనసులో ఉన్నది తెలియజేయమని ప్రోత్సహించాలి.

ఓపెన్ కమ్యూనికేషన్ అంటే ఏమిటి?

ఓపెన్‌ కమ్యూనికేషన్‌ అంటే ప్రాథమికంగా మనం మన భావాలను, ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయడం. దీని అర్థం మనం ఏదైనా విషయంలో బాధపడుతున్నా లేదా కోపంగా ఉన్నా, దాన్ని దాచుకోకుండా మన భాగస్వామితో పంచుకోవడం. మన భాగస్వామి మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినడం. వాళ్ళు ఏమి చెప్పాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. మధ్యలో అంతరాయం కలిగించకుండా వాళ్ళ మాటను పూర్తిగా వినడం. ఒకరినొకరు నిందించకుండా, తప్పులు వెతకకుండా, విషయాన్ని స్పష్టంగా చెప్పడం. సమస్యను పరిష్కరించడానికి కలిసి కృషి చేయడం. ఒకరిపై ఒకరు తప్పులు వేయకుండా, సమస్యను ఎలా పరిష్కరించవచ్చో కలిసి ఆలోచించడం వంటి లక్షణాలు ఓపెన్‌ కమ్యూనికేషన్. 

దీంతో పాటు కష్ట సమయాల్లో భర్త మీ మంచి చెడులను పొంచుకోవాల్సి ఉంటుంది. ఇది కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా, మానసికంగా కూడా ఉండాలి. కష్ట సమయాల్లో భార్యను ప్రోత్సహించడం, ఆమెలో ఉన్న సానుకూలతను పెంపొందించడం చాలా అవసరం. ప్రేమే అన్ని సమస్యలకు పరిష్కారం. కష్ట సమయాల్లో భార్యను ప్రేమతో చూడటం చాలా ముఖ్యం. భార్యతో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఆమెతో మాట్లాడాలి, ఆమెకు వినాలి. ష్ట సమస్యలను కలిసి కూర్చుని చర్చించి, పరిష్కార మార్గాలను కనుక్కోవాలి. ఇలాంటి లక్షణాలు గుడ్‌ హస్బెండ్‌ లో కనిపిస్తాయి. ఒక వివాహ బంధం సుఖంగా సాగడానికి భార్యాభర్తల మధ్య గౌరవం అనేది అతి ముఖ్యమైన అంశం. భర్త తన భార్యను గౌరవించినప్పుడు ఆమె ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వారి మధ్య ప్రేమ, విశ్వాసం బలపడుతుంది. ఒక మంచి భర్తగా అవ్వాలంటే ముందు భార్యను గౌరవించాలి. 

Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook 

Trending News