How To Make Carrot Halwa Recipe In Telugu: క్యారెట్ మన ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే చాలామంది పిల్లలకు క్యారెట్ తో తయారు చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా ఇస్తూ ఉంటారు ప్రతిరోజు ఒకటి నుంచి రెండు క్యారెట్లను ఉదయం పూట అల్పాహారంలో భాగంగా తీసుకుంటే శరీరానికి అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే భారతీయులు ఎక్కువగా సాంబార్‌తో పాటు ఇతర ఆహార పదార్థాలలో మిక్స్ చేసి వండుకుంటూ ఉంటారు. క్యారెట్‌ను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా వండుకుంటారు. అయితే చాలామందికి క్యారెట్ అనగానే గుర్తుకొచ్చేది ఎక్కువగా హల్వానే. చిన్నపిల్లల నుంచి పెద్ద వారి దాకా ఈ రెసిపీని ఎంతో ఇష్టపడి తింటూ ఉంటారు. నూటికి తీపినందించే ఈ క్యారెట్ హల్వాను చాలామంది ఎంతో కష్టపడి తయారు చేస్తారు. ఇకనుంచి శ్రమపడనక్కర్లేదు.. అయితే మీ మందించే కొన్ని సింపుల్ టిప్స్ ను వినియోగించి సులభంగా క్యారెట్ హల్వాను తయారు చేసుకోవచ్చు.
క్యారెట్ హల్వాకు కావాల్సిన పదార్థాలు:
వేయించి పక్కన పెట్టుకున్న ఆఫ్ కప్ తరిగిన డ్రై ఫ్రూట్స్
హల్వా కు కావాల్సినంత యాలకుల పొడి
నాలుగు టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్
ఒక కప్పు కాచి చల్లార్చిన చిక్కటి బర్రె పాలు
అరకప్పు పంచదార
350 గ్రాముల పచ్చి క్యారెట్ తురుము
నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాచి చల్లార్చిన చిక్కటి పాలను పోసుకొని, కావాల్సినంత మిల్క్ పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ పై కళాయి పెట్టి అందులో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాల్సి ఉంటుంది. ఇందులోనే క్యారెట్ తురుమును వేసుకొని, ఆ తురుములో ఉన్న పచ్చిదనం పోయేవరకు వేయించుకుంటూ ఉండాలి.
తర్వాత పచ్చివాసన పోయిన క్యారెట్ తురుము కళాయిలో పక్కన పెట్టుకున్న పాలు పోసి.. మూడు నుంచి నాలుగు నిమిషాల వరకు బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత అందులోనే పంచదార వేసి బాగా కలుపుకోవాలి. ఇలా పది నిమిషాల పాటు కలుపుకొని తగినంత యాలకుల పొడి వేసి, మరో రెండు నిమిషాల పాటు బాగా కలుపుకోవాల్సి ఉంటుంది. ఇలా కలుపుకున్న వెంటనే మరో రెండు స్పూన్ల నెయ్యిని వేసి, బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత అందులో వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని మరోసారి బాగా మిక్స్ చేసి స్టవ్‌ని పక్కకు దింపేయాలి. 15 నిమిషాలు పక్కన పెట్టి ఈ క్యారెట్ హల్వాను సర్వ్ చేసుకుని తినొచ్చు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter