Natural Mouth Fresheners: బిర్యానీ, మసాలా ఆహారాలు, ఉల్లి, వెల్లుల్లి వంటివి తిన్న తర్వాత నోటి వాసన రావడం చాలా సర్వసాధారణం. ఇలాంటి సమస్యలకు మౌత్ ఫ్రెషనర్లు వాడుతుంటారు. కానీ వీటిని ఉపయోగించడం వల్ల ఎలాంటి లాభం ఉండదు. అయితే దీని కంటే సహజ పదార్థాలు వాడటం చాలా మంచిదని ఆరోగ్యానిపుణులు చెబుతున్నారు. అయితే ఏ పదార్థాలు ఉపయోగించడం వల్ల నోటి వాసన తగ్గుతుంద అనేది తెలుసుకుందాం.
నోటి వాసన తగ్గించే ఇంటి చిట్కాలు:
యాలకులు: యాలకులను ఎక్కువగా వంట్లో, స్వీట్ తయారు చేయడంలో ఉపయోగిస్తాము. ఇది మౌత్ ఫ్రెషనర్‌గా పని చేస్తాయి. నోటి వాసన ఉన్నప్పుడు ఒక ఇలాచీ తింటే సరిపోతుంది. ఇందులో ఉండే కొన్ని లక్షణాలు వాసనను తొలగించడంలో సహాయపడుతుంది.
తులసి, పుదీనా ఆకులు:
తులసి, పుదీనాలకు మంచి ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది బ్యాడ్ బ్రీత్ను తొలగించడంలో ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిటిని నమిలి తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది.
లవంగాలు:
లవంగాలను బియ్యానిలో ఎక్కువగా ఉపయెగిస్తాము. ఇది ఎంతో ఘాటు వాసనను కలిగి ఉంటాయి. చెడు వాసనతో ఇబ్బంది పడేవారు ఒక లవంగం ముక్కను తినడం వల్ల నోటి వాసన తొలిగి మంచి వాసన ఉంటుంది. అంతేకాకుండా శ్వాసకోస సమస్యలు కూడా తగ్గుతాయి.
జామ ఆకులు:
జామ పండు మాత్రమే కాకుండా జామ ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు నోటి వాసనను తొలగించడంలో సహాయపడుతుంది. వాసనతో పాటు చిగురుల నొప్పి కూడా తగ్గుతుంది.
దాల్చిన చెక్క-తేనె:
దాల్చిన చెక్క తేనె నోటి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ రెండిటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు చెడు బ్యాక్టీరియాలను తొలగించడంలో మేలు చేస్తాయి. దీని వల్ల నోటి వాసన తగ్గుతుంది.
పెరుగు:
పెరుగులో ఉండే లాక్టిక్ యాసిడ్ నోటిలోని బ్యాక్టీరియాను తగ్గిస్తుంది. దీని వల్ల నోటి వాసన తగ్గుతుంది.
పళ్లు, నాలుక శుభ్రం చేసుకోవడం:
రోజుకు రెండుసార్లు పళ్లు బ్రష్ చేయడం, నాలుకను క్లీనర్ తో శుభ్రం చేసుకోవడం చాలా ముఖ్యం.
పసుపు:
పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. పసుపుతో కూడిన నీటిని నోటితో బుక్ చేసుకోవడం వల్ల నోటి వాసన తగ్గుతుంది.
పచ్చి కూరగాయలు, పండ్లు తినడం:
ఆపిల్, క్యారెట్, సెలరీ వంటి పచ్చి కూరగాయలు, పండ్లు నమలడం వల్ల నోటిలోని బ్యాక్టీరియా తొలగిపోతుంది.
Also Read: Belly Fat: సెలెరీ టీని ఎప్పుడైనా ట్రై చేశారా? బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ టీ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook