Breakfast Precautions: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 టిఫిన్లు తింటే అంతే సంగతులు, తస్మాత్ జాగ్రత్త

Breakfast Precautions: మనం తీసుకునే ఆహారాన్ని బట్టే ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. రోజూ ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటిది తీసుకోకూడదనే వివరాలు తెలుసుకోవడం చాలా అవసరం. ఎందుకంటే దినచర్యను బట్టే ఎంత ఆరోగ్యంగా ఉన్నామనేది ఉంటుంది. ఇందులో ప్రధానమైంది బ్రేక్‌ఫాస్ట్. 

Written by - Md. Abdul Rehaman | Last Updated : Aug 17, 2023, 01:33 PM IST
Breakfast Precautions: ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఈ 5 టిఫిన్లు తింటే అంతే సంగతులు, తస్మాత్ జాగ్రత్త

Breakfast Precautions: చాలామంది బ్రేక్‌ఫాస్ట్ విషయంలో చాలా నిర్లక్ష్యంగా ఉండటమే లేక తేలిగ్గా తీసుకోవడమే చేస్తుంటారు. కొంతమందైతే బ్రేక్‌ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు. ఇది మీ ఆరోగ్యాన్ని పాడు చేయడమే కాకుండా పలు అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్ చేయడం ఒక్కటే ముఖ్యం కాదు..ఆ బ్రేక్‌ఫాస్ట్‌లో ఏం తింటున్నామనేది కూడా ముఖ్యం. ఎందుకంటే మీ దినచర్య ప్రారంభమయ్యేది దాంతోనే. 

ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ ఆధునిక పోటీ ప్రపంచంలో ఎన్నో రకాల పనులు. మరెన్నో రకాల అలవాట్లు. రోజంతా మీ పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి. చురుగ్గా ఉండాలి. పనుల చేసేందుకు ఎనర్జీ అవసరం. రోజంతా ఆరోగ్యంగా, చురుగ్గా, ఎనర్జిటిక్ గా ఉండాలంటే బ్రేక్‌‌ఫాస్ట్ అనేది ఆరోగ్యకరమైందిగా ఉండాలి. ఎందుకంటే మన శరీరం రాత్రంతా విశ్రాంతిలో ఉంటుంది. ఉదయం లేవగానే ఎనర్జిటిక్ ఫుడ్ అందిస్తే ఆ రోజంతా బాగుంటుంది. ఇష్టమొచ్చినట్టు జంక్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ వంటి పలు అనారోగ్య సమస్యలు తలెత్తడమే కాకుండా ఏ పనీ సక్రమంగా చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఈ ఐదు రకాల టిఫిన్లు తీసుకోవద్దని వైద్యులు పదే పదే హెచ్చరిస్తున్నారు.

ఉత్తరాదిన చాలా ఇష్టంగా తినే బ్రేక్‌ఫాస్ట్ చోళే భటూరే. అంటూ పూరీ శెనగల కూర. అల్పాహారంగా ఇది తీసుకోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతిటుంది. తెలుగు రాష్ట్రాల్లో శుద్ది చేసిన గోధుమ పిండితో తయారు చేసే పూరీలు ఇష్టంగా తింటారు. ఇది మైదాతో సమానం. పదే పదే వేడిచేసిన నూనెలో పూరీలు వేయించడం వల్ల భారీగా కొలెస్ట్రాల్ చేరుతుంది. ఇది రక్తపోటు, ఎసిడిటీ, కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేస్తుంది.

ఇంకొంతమంది పరాఠాలు, చపాతీలు ఇష్టంగా తింటారు. ఇందులో కూర కింద క్యాబేజీ, బంగాళదుంప, పన్నీర్ వినియోగిస్తారు. వీటిని ఎక్కువ సేపు నూనెలో వినియోగించడం వల్ల ఆరోగ్యానికి హానికరం. ఇంకొంతమంది ముఖ్యంగా ఉత్తరాదిన బ్రేక్‌ఫాస్ట్‌లో జిలేబీలు, గులాబ్ జామున్, రసగుల్లా వంటి స్వీట్స్ ఎక్కువగా తింటుంటారు. వీటిలో ఉండే చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదు. స్థూలకాయం ఇలాంటి పదార్ధాల వల్లే వస్తుంది.

ఇక ఆధునిక పోటీ ప్రపంచంలో సమయం లేదనే కారణంగా మ్యాగీ, నూడిల్స్ వంటివి చాలా ఎక్కువగా తింటారు. ఇవి శరీరంలో ఎముకలు, కణజాలాలకు హాని కల్గిస్తుంది. ఇవన్నీ జంక్ ఫుడ్స్ జాబితాలో ఉండే పదార్ధాలు. ఆరోగ్యానికి తక్షణం హాని కల్గించే పదార్ధాలివి. 

ఇవి కాకుండా వడ, గారె, బొండాలు, బజ్జీలు, వంటివి ఆయిలీ ఫుడ్స్ టిఫిన్‌లో ఎక్కువగా తీసుకుంటుంటారు. నూనెలో ఎక్కుగా వండే పదార్ధాలు కావడం వల్ల కొలెస్ట్రాల్ ముప్పు చాలా ఎక్కువ. లివర్‌కు హాని కల్గిస్తాయి. అదే సమయంలో మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఏ మాత్రం మంచిది కాదు. అందుకే బ్రేక్‌ఫాస్ట్‌లో వీటికి దూరంగా ఉండాలి. 

Also read: Damaged Hair: దెబ్బతిన్న జుట్టును తిరిగి పొందడానికి బెస్ట్‌ 5 హెయిర్‌ ఆయిల్స్‌ ఇవే, రోజు ఇలా చేయండి!

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News