న్యూఢిల్లీ: సీఆర్పీఎఫ్ జవాన్ల కాన్వాయ్‌పై ఉగ్రవాదులు దాడికి పాల్పడి 40 మంది జవాన్లను పొట్టనపెట్టుకోవడంపై స్పందించిన సీఆర్పీఎఫ్.. దాడికి బాధ్యులైన ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకుంటాం అని ప్రకటించింది. గురువారం దాడి జరగగా శుక్రవారం నాడు ట్విటర్ ద్వారా స్పందించిన సీఆర్పీఎఫ్.. ''దాడిని మర్చిపోవడం కానీ బాధ్యులైన వారిని మన్నించడం కానీ జరగదు'' అని స్పష్టంచేసింది. అమరవీరులకు జోహార్లు అర్పించిన సీఆర్పీఎఫ్ వారి కుటుంబాలకు అండగా ఉంటాం అని ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఈ దుశ్చర్యకు పాల్పడిన వారిపై దెబ్బకు దెబ్బ కొట్టి ప్రతీకారం తీర్చుకుంటాం అని తమ ట్వీట్‌లో పేర్కొంది.
WE WILL NOT FORGET, WE WILL NOT FORGIVE:We salute our martyrs of Pulwama attack and stand with the families of our martyr brothers. This heinous attack will be avenged. pic.twitter.com/jRqKCcW7u8
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) February 15, 2019
ప్రతీకారం తీర్చుకుంటాం: ఉగ్రవాదుల దాడిపై సీఆర్పీఎఫ్ స్పందన