Blast at Chemical Factory in UP: ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో ఉన్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలిపోవడంతో పెను ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనలో 12 మంది మృతి చెందగా మరో 21 మంది తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా ఎగిరిపడ్డాయి. శరీర భాగాలు తెగిపోయి.. గుర్తుపట్టలేని స్థితిలో మృతదేహాలు కనిపించాయి. పేలుడుకు గల కారణాలేంటన్నది ఇంకా తెలియరాలేదు.
ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ ఎలక్ట్రానిక్స్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌గా స్థానిక అధికారి ఒకరు పేర్కొనడం గమనార్హం. అందులోని బాయిలర్ యూనిట్ పేలడం వల్లే ప్రమాదం జరిగినట్లు ఆ అధికారి తెలిపారు. ఆ ఫ్యాక్టరీలో కేవలం ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి మాత్రమే అనుమతి ఉందని.. కానీ అది కాకుండా ఇంకేవో ఉత్పత్తి చేస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. సంఘటనా స్థలంలో గన్‌పౌడర్ ఆనవాళ్లు లభించాయన్నారు.
శనివారం (జూన్ 5) మధ్యాహ్నం 3 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు పోలీసులు తెలిపారు. పేలుడు ధాటికి భూకంపం వచ్చిందేమోనని సమీపంలోని ఇళ్ల నుంచి ప్రజలు బయటకు పరుగులు తీసినట్లు వెల్లడించారు. ఫ్యాక్టరీ బయట శరీర భాగాలు తెగిపోయిన స్థితిలో కార్మికుల మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయాయన్నారు. దీంతో మృతదేహాలను గుర్తించడం చాలా కష్టంగా మారిందన్నారు. గాయపడినవారిలో ఒక్కరు కూడా మాట్లాడే స్థితిలో లేరని చెప్పారు. క్షతగాత్రులను ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీలో 50 మంది పనిచేస్తున్నట్లు తెలిపారు.
చెల్లాచెదురుగా పడి ఉన్న మృతదేహాలతో ఫ్యాక్టరీ వద్ద భీతావహ వాతవరణం నెలకొంది.ఫ్యాక్టరీలో పనిచేసేవారి కుటుంబ సభ్యులు, బంధువులు అక్కడ పడి ఉన్న మృతదేహాల్లో తమవారి కోసం వెతుకుతున్నారు. ప్రమాదంలో మృతులకు ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు.మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. మృతులు, క్షతగాత్రుల కుటుంబాలకు అవసరమైన సాయం అందజేయాలని స్థానిక అధికారులను సీఎం యోగి ఆదేశించారు. ప్రమాద ఘటనపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది.
Also Read: Minor Girl Gang Rape: మైనర్ బాలిక కారు వీడియో ఎలా లీకైంది.. రఘునందన్ కు పంపింది ఎవరు?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook