Union Cabinet Meet: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు

Union Cabinet Meet: కరోనా సంక్రమణ, ఇతర కీలకాంశాలపై కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. మంత్రిత్వశాఖల పనితీరు, సమీక్ష జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ద్రోన్ దాడి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jun 30, 2021, 01:35 PM IST
  • ఇవాళ సాయంత్రం ప్రధాని మోదీ ఆధ్వర్యాన వర్చువల్ విధానంలో కేంద్ర కేబినెట్ భేటీ
  • జమ్ము ద్రోన్ దాడి , కరోనా పరిస్థితులు, మంత్రివర్గంలో మార్పులపై చర్చ
  • మంత్రివర్గ విస్తరణ జరగనుందంటూ విస్తృతంగా సాగుతున్న ప్రచారం
Union Cabinet Meet: ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీ, మంత్రివర్గ విస్తరణపై ఊహాగానాలు

Union Cabinet Meet: కరోనా సంక్రమణ, ఇతర కీలకాంశాలపై కేంద్ర కేబినెట్ ఇవాళ సమావేశం కానుంది. మంత్రిత్వశాఖల పనితీరు, సమీక్ష జరగనుంది. కోవిడ్ పరిస్థితులు, ద్రోన్ దాడి అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) ఆధ్వర్యంలో ఇవాళ సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. కరోనా సంక్రమణ నేపధ్యంలో వర్చువల్ ద్వారా మంత్రివర్గం సమావేశం జరగనుంది. దేశంలో నెలకొన్న కోవిడ్ పరిస్థితులు, జమ్ము సైనిక స్థావరంపై జరిగిన ద్రోన్ దాడి (Drone Attack) వంటి అంశాలపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటలకు జరిగే మంత్రివర్గ సమావేశంలో మంత్రిత్వ శాఖల పనితీరు, మార్పులు, విస్తరణపై చర్చ జరగనుందని తెలుస్తోంది.పలువురి శాఖల మార్పు జరగవచ్చని సమాచారం. అదే సమయంలో 60 గా ఉన్న మంత్రివర్గాన్ని 79కు పెంచవచ్చని తెలుస్తోంది. ఇటీవలికాలంలో కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ వరుస భేటీలు ఈ సందర్బంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కరోనా సెకండ్ వేవ్, థర్డ్‌వేవ్ ముప్పు(Corona Third wave) వంటి అంశాలపై ప్రధానంగా చర్చ జరగనుంది. జూలై నెలలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనుండటంతో ఈసారి మంత్రివర్గ భేటీకు (Union Cabinet Meet) ప్రాముఖ్యత ఏర్పడింది. మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు కచ్చితంగా ఉంటాయని భావిస్తున్నారు. 

Also read: Corona Compensation: కరోనా మృతులకు పరిహారం ఇవ్వాల్సిందే : సుప్రీంకోర్టు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News