Akhilesh Yadav to contest Assembly Election : సమాజ్‌వాదీ పార్టీ అధినేత, ఎంపీ అఖిలేశ్ యాదవ్ ఈసారి యూపీ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ శ్రేణుల నుంచి పెరుగుతున్న ఒత్తిడి మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఆయన నిర్ణయించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే సీఎం యోగి ఆదిత్యనాథ్ పోటీ ఖరారు కావడంతో అఖిలేశ్ కూడా పోటీకి దిగాలని పార్టీ శ్రేణులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ అఖిలేశ్ బరిలో దిగితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేయడం ఇదే తొలిసారి అవుతుంది.
ప్రస్తుతం అఖిలేశ్ యాదవ్ అజంగఢ్ ఎంపీగా కొనసాగుతున్నారు. గతంలోనూ పలు పర్యాయాలు ఎంపీగా పనిచేశారు. 2012లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీ హోదాలో ఆ పదవిలో కొనసాగారు. అలా ఇప్పటివరకూ అఖిలేశ్ అసెంబ్లీకి పోటీ చేయలేదు. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో అజంగఢ్ లోక్‌సభ పరిధిలోని గోపాల్పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అఖిలేశ్ యాదవ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
నిజానికి పోటీకి దూరంగా ఉంటున్నట్లు గతంలో అఖిలేశ్ వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంపై ఫోకస్ చేయాల్సి ఉన్నందునా... తాను పోటీలో ఉండదలుచుకోలేదని చెప్పారు. కానీ పార్టీ నేతల నుంచి రోజురోజుకు ఒత్తిడి పెరుగుతుండటంతో పోటీకి సిద్ధపడుతున్నారు. గోపాల్పూర్తో పాటు మరో నియోజకవర్గం నుంచి అఖిలేశ్ పోటీ చేయవచ్చునని చెబుతున్నారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కూడా తొలిసారి అసెంబ్లీ ఎన్నికల్లో (UP Assembly Election 2022) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్సీ హోదాలో ఆయన సీఎం పదవిలో కొనసాగుతున్నారు. పార్టీ అధిష్ఠానం నిర్ణయం మేరకు ఈసారి గోరఖ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. కాగా, యూపీలోని 403 అసెంబ్లీ స్థానాలకు ఏడు విడతల్లో పోలింగ్ జరగనుంది. తొలి విడత ఎన్నికలు ఫిబ్రవరి 10న జరగనుండగా.. ఏడో విడత పోలింగ్ మార్చి 7న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మార్చి 10న వెల్లడవుతాయి.
Also Read: ఇటీవల 'పుష్ప'లో మెరిసిన జూనియర్ ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి... ఆమె మృతిపై అనుమానాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook