Pegasus hacking: ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారం ప్రముఖ రాజకీయ నేతలు, సీనియర్ జర్నలిస్టులు, రాజకీయ విశ్లేషకులను షేక్ చేస్తోంది. పెగాసస్ స్పైవేర్ ప్రస్తుతం ప్రముఖులకు నిద్ర కరువయ్యేలా చేసింది. రెండేళ్ల క్రితం పలువురు మేథావులు, నేతలు, జర్నలిస్టుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే వార్తా కథనాలు అప్పట్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా అదే తరహాలో మరోసారి పెగాసస్ స్పైవేర్ (Pegasus spyware) తెరపైకి రావడం అనేక అనుమానాలకు తావిస్తోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్‌తో (Rahul Gandhi, Prashant Kishor) పాటు ఇంకొంత మంది ప్రముఖుల ఫోన్లు హ్యాకర్స్ టార్గెట్ జాబితాలో ఉన్నట్లు ది వైర్ వార్తా సంస్థ వెల్లడించడం సంచలనం సృష్టించింది. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ (Mamata Banerjee) మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, మాజీ సీఈసీ అశోక్ లావాసా, కేంద్రమంత్రులు అశ్వినీ వైష్ణవ్, ప్రహ్లాద్ పటేల్ (Ashwini Vaishnaw, Prahlad Patel), ప్రశాంత్ కిషోర్ సన్నిహితుల ఫోన్ నంబర్లు హ్యాకర్స్ జాబితాలో ఉన్నట్లు ది వైర్ కథనం పేర్కొంది.
Also read: Fuel Prices: పెట్రోల్, డీజిల్ ధరల్ని జీఎస్టీలో చేర్చే విషయమై స్పష్టత ఇచ్చిన కేంద్రం
ఇదిలావుంటే, పెగాసస్ హ్యాకింగ్ (Pegasus hacking) వ్యవహారంపై కేంద్రం ఘాటుగా స్పందించింది. హ్యాకింగ్ కథనాలు ఉద్దేశపూర్వకంగా వస్తున్నాయే తప్ప అందులో నిజం లేదని కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (IT Minister Ashwini Vaishnaw) అభిప్రాయపడ్డారు. అయితే, కాంగ్రెస్ నేతలు మాత్రం కేంద్రం కుట్రపన్నుతోందని ఆరోపిస్తున్నారు.
Also read : IPS RS Praveen Kumar resigns: ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజీనామా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook