Pujab Election Result 2022: పంజాబ్ ఎన్నికల్లో ఊహించని ఫలితాలు వెలువడుతున్నాయి. 117 స్థానాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో (Pujab Assembly Elections 2022) ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ఇప్పటికే 90పైకి స్థానాల్లో గెలిచింది. ఆధిక్యం దిశగా దూసుకుపోతుంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన మ్యానిఫెస్టో, హామీలకు పంజాబ్ ప్రజలు ఫిదా అయ్యారు. అందుకే ఆఫ్ కు పట్టం కట్టారు.
అయితే పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ (Captain Amrinder Singh) తాజా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఆప్ అభ్యర్థి అజిత్‌పాల్ కోహ్లి చేతిలో 19,797 ఓట్ల తేడాతో పరాజయం చెందారు. అమరీందర్ పాటియాలా అర్బన్ లెజిస్లేటివ్ అసెంబ్లీ (Patiala Assembly Constituency) స్థానం నుండి పోటీచేసి ఓడిపోయారు. కెప్టెన్ అమరీందర్ సింగ్ 2017 శాసనసభ ఎన్నికలలో పాటియాలా అర్బన్ శాసనసభ స్థానం నుండి కాంగ్రెస్ టిక్కెట్‌పై గెలిచి పంజాబ్ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే ఈసారి ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
గత ఏడాది సెప్టెంబర్‌లో పంజాబ్ ముఖ్యమంత్రి పదవి నుంచి కాంగ్రెస్ తొలగించడంతో కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీని స్థాపించారు. దీనికి పంజాబ్ లోక్ కాంగ్రెస్ పార్టీ అని పేరు పెట్టారు. తాజాగా ఈ పార్టీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కెప్టెన్ అమరీందర్ సింగ్ పాటియాల స్థానం నుంచి నాలుగు సార్లు (2002, 2007, 2012 మరియు 2017) పోటీ చేసి గెలుపొందారు.
Also Read: Punjab Election Results 2022: పంజాబ్‌లో ఆప్ విజయానికి కారణాలేంటి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook