e Flying Boat: చెన్నై నుంచి కోల్‌కతాకు మధ్య దూరం 1600 కిలోమీటర్లు. ఈ దూరాన్ని 3 గంటల వ్యవధిలో కేవలం 6 వంద రూపాయల ఖర్చుతో చేరవచ్చంటే నమ్మలేకపోతున్నారా..కానీ అంతా అనుకూలిస్తే ఇది సాధ్యమే. మద్రాస్ ఐఐటీ సహకారంతో ఓ స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ కొత్త ఆవిష్కరణ ఇది. దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం.
ఇటీవల బెంగళూరులో జరిగిన ఏరో ఇండియా 2025లో ఓ ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. విశేషంగా చర్చనీయాంశమౌతోంది. అదే చెన్నైకు చెందిన స్టార్టప్ కంపెనీ వాటర్ ఫ్లై టెక్నాలజీస్ మద్రాస్ ఐఐటీ సహకారంతో రూపొందించిన ఇ ప్లయింగ్ బోట్. విమానయానం, జలమార్గాలకు ఇది ప్రత్యామ్నాయం. ఇది నీటి ఉపరితలం నుంచి టేకాఫ్ అవుతుంది. నీటి ఉపరితలానికి 4 మీటర్ల ఎత్తులో సమాంతరంగా గాలిలో ఎగురుతూ నిర్దిష్ట వేగంతో ప్రయాణిస్తుంది. ఇ ఫ్లయింగ్ బోట్ గరిష్ట వేగం గంటకు 500 కిలోమీటర్లు ఉంటుంది. జీరో కార్బన్ ఉద్గారాలు లక్ష్యం కావడంతో పర్యావరణానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న విమానయానానికి పూర్తిగా భిన్నంగా, ప్రత్యామ్నాయంగా ఉంటుంది.
ప్రస్తుతం వాటర్ ఫ్లై టెక్నాలజీస్ కంపెనీ 500 కిలోమీటర్ల పరిధి కలిగిన బ్యాటరీతో పనిచేస్తుంది. కానీ 2000 కిలోమీటర్లు ప్రయాణించేలా హైడ్రోజన్ ఎలక్ట్రిక్ వేరియంట్‌ను అభివృద్ధి చేస్తోంది. నీటిపై ప్రయాణించేలా వీటిని డిజైన్ చేసినా ఇవి ఐస్, ఎడారి ఇతర ఉపరితలాలపై కూడా ఎగురగలవు. 2029 నాటికి చెన్నై-సింగపూర్ మధ్య ఇ ఫ్లయింగ్ బోట్స్ అందుబాటులో వచ్చే విధంగా కంపెనీ ప్రణాళిక రచిస్తోంది. 2026 నాటికి ఇంటర్నేషనల్ మేరిటైమ్ ఆర్గనైజేషన్‌లో భాగంగా ఇండియన్ రిజిస్ట్రార్ ఆఫ్ షిప్పింగ్ సర్టిఫికెట్ కోసం వాటర్ ఫ్లై టెక్నాలజీస్ లక్ష్యంగా ఉంది. ఈ తరహాలో మొట్టమొదటి ఇంటర్నేషనల్ రూట్ దుబాయ్-లాస్ ఏంజెల్స్ కానుందని అంచనా.
త్వరలో నాలుగు టన్నుల బరువు సామర్ధ్యంతో ఫ్లయింగ్ బోట్ రూపొందించే ఆలోచనలో కంపెనీ ఉంది. అంటే పూర్తిగా 20 సీట్ల సామర్ధ్యంతో క్రాఫ్ట్ గ్రౌండ్ ఎఫెక్ట్ విగ్ క్రాఫ్ట్ అభివృద్ధి చేయనుంది. ఇప్పుడు ఫ్లయింగ్ బోట్ అభివృద్ధి చేసిన మద్రాస్ ఐఐటీ జట్టే గతంలో తొలి ఎలక్ట్రిక్ రేస్ కార్ నిర్మించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఫ్లయింగ్ బోట్ పూర్తి స్థాయిలో అందుబాటులో వస్తే చెన్నై-కోల్‌కతా మధ్య 16 వందల కిలోమీటర్ల దూరాన్ని కేవలం 6 వందల రూపాయలకే మూడే మూడు గంటల్లో చేరవచ్చు.
Also read: New Chief Election Commissioner: కొత్త ఛీప్ ఎలక్షన్ కమీషనర్‌గా జ్ఞానేశ్ కుమార్‌కు అవకాశాలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి