CM BS yediyurappa రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్‌ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్‌ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.

Last Updated : Nov 28, 2020, 08:43 AM IST
  • కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్‌ (R Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు.
  • సంతోష్‌ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు.
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్‌ను శనివారం ఉదయం ముఖ్యమంత్రి యడియూరప్ప పరామర్శించారు
CM BS yediyurappa రాజకీయ కార్యదర్శి ఆత్మహత్యాయత్నం

Karnataka CM's political secretary attempts suicide: బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప ( BS yediyurappa ) రాజకీయ కార్యదర్శి ఎన్‌ఆర్‌ సంతోష్‌ (NR Santosh ) ఆత్మహత్యాయత్నం చేశారు. సంతోష్‌ శుక్రవారం నిద్రమాత్రలు మింగి బలవన్మరణానికి ప్రయత్నించారు. దీంతో ఆయన్ను బెంగళూరు (Bengaluru) లోని రామయ్య మెమోరియల్‌ ఆసుపత్రికి తరలించి అత్యవసర వైద్యం అందించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి బాగానే ఉన్నదని ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. అయితే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించడానికి గల కారణాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది. 

 CM BS Yediyurappa, NR Santosh

ఇదిలాఉంటే.. తన రాజకీయ కార్యదర్శి సంతోష్ ఆత్యహత్యకు పాల్పడిన సంఘటనపై సీఎం యడియూరప్ప స్పందించారు. ఆయన ఎందుకు బలవన్మరణానికి ప్రయత్నించారో తనకూ తెలియదని చెప్పారు. సంతోష్‌ కుటుంబ సభ్యులతో మాట్లాడుతానని సీఎం ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి.. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంతోష్‌ను శనివారం ఉదయం పరామర్శించారు. ప్రస్తుతం ఆయన కోలుకున్నారని, ఆరోగ్యం బాగానే ఉందని యడియూరప్ప తెలిపారు. 

Also read: Kiara Advani: ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తున్న కియారా అద్వానీ.. లేటెస్ట్ పిక్స్

Also read: Nidhhi Agerwal: హుషారెక్కిస్తున్న ‘నిధి’‌ సోయగాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News