Private Medical Colleges Fees: దేశంలో తక్కువ ఫీజు కలిగిన టాప్ 9 మెడికల్ కళాశాలలివే, ఎక్కడ ఎంత ఫీజు ఉందంటే

Private Medical Colleges Fees: నీట్ యూజీ 2024 కౌన్సిలింగ్ మరి కొద్దిరోజుల్లో ప్రారంభం కానుంది. నీట్ పరీక్షపై నెలకొన్న వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడటంతో ఇక కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో దేశంలోని తక్కువ ఫీజు ఉన్న టాప్ 9 మెడికల్ కళాశాలలేంటో తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Jul 24, 2024, 06:35 PM IST
Private Medical Colleges Fees: దేశంలో తక్కువ ఫీజు కలిగిన టాప్ 9 మెడికల్ కళాశాలలివే, ఎక్కడ ఎంత ఫీజు ఉందంటే

Private Medical Colleges Fees: డాక్టర్ కావాలనేది ప్రతి ఒక్కరికీ కల. అది సాకారం చేసుకోవాలంటే చదువుతో పాటు ఆర్ధిక స్థోమత కూడా ఉండాలి. కొన్ని కళాశాలల్లో అయితే ఫీజులు లక్షల్లో ఉండి చదివించలేని పరిస్థితి ఉంటుంది. ఇండియాలో వైద్య విద్యా చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. పిల్లల్ని మెడిసిన్ చదివించాలనుకుంటే ఆయా కళాశాలల్లో ఫీజుల వివరాలు కూడా తెలుసుకోవాలి. ఈ క్రమంలో దేశంలోని టాప్ 9 వైద్య కళాశాలల్లో ఫీజుల వివరాలు ఇలా ఉన్నాయి.

గాంధీ మెడికల్ కళాశాల, సికింద్రాబాద్

తెలంగాణ హైదరాబాద్ నగరంలో ఉంది. రాష్ట్రంలోని కాళోజి నారాయణరావు హెల్త్ యూనివర్శిటీకు అనుబంధమిది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎన్టీఆర్ హెల్త్ వర్శిటీకు అనుబంధంగా ఉండేది. ఈ కళాశాలలో ఏడాదికి ఎంబీబీఎస్ ఫీజు కేవలం 12 వేలు మాత్రమే. మొత్తం కోర్సుకు 1.3 లక్షలవుతుంది.

సీఎంసీ వెల్లూరు

తమిళనాడులోని వెల్లూరులో ఉన్న క్రిస్టియన్ మెడికల్ కళాశాల ఇది. ఇది చాలా ప్రసిద్ధికెక్కిన ప్రైవేట్ మెడికల్ కళాశాల. ఈ సంస్థ పరిధిలో ప్రైమరీ, సెకండరీ, టెరిటరీ ఆసుపత్రులున్నాయి. ఇక్కడ ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 40 వేల 330 రూపాయలు. 

కిమ్స్ బెంగళూరు

కెంపేగౌడ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. కర్ణాటక రాష్ట్రంలో బెంగళూరులో ఉంది. రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధంగా నడుస్తోంది. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 1.95 లక్షల రూపాయలు.

మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మహారాష్ట్ర

మహారాష్ట్రలోని సేవాగ్రామ్ గ్రామంలో ఉంది. ఇది దేశంలోని మొట్టమొదటి గ్రామీణ వైద్య కళాశాల. కస్తూరిబా హెల్త్ సొసైటీ నిర్వహిస్తోంది. ఇది నాగపూర్ యూనివర్శిటీకు అనుబంధంగా ఉండేది. ఇప్పుడు మహారాష్ట్ర యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధంగా నడుస్తోంది. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 2.63 లక్షల రూపాయలు.

ఎంఎస్ రామయ్య మెడికల్ కళాశాల, బెంగళూరు

రామయ్య యూనివర్శిటి ఆఫ్ అప్లైడ్ సైన్సెస్ ఆధ్వర్యంలో నడిచే ప్రైవేట్ మెడికల్ కళాశాల. ఆర్ఎంసీగా పిలుస్తారు. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 3-4 లక్షల రూపాయలుగా ఉంది.

వైదేహి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్

ఇది కూడా కర్ణాటకలోని బెంగళూరులో ఉన్న ప్రైవేట్ మెడికల్ కళాశాల. ఇక్కడ పీజీ కూడా ఉంది. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 4-5 లక్షల రూపాయలు.

దయానంద్ మెడికల్ కళాశాల, లూథియానా, పంజాబ్

ఇదొక ప్రైవేట్ మెడికల్ కళాశాల.బాబా ఫరీద్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అనుబంధంగా నడుస్తోంది. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 4.6 లక్షల రూపాయలు.

సెయింట్ జాన్ మెడికల్ కళాశాల, బెంగళూరు

ఇది కూడా బెంగళూరులో ఉన్న క్రిస్టియన్ మైనారిటీ మెడికల్ కళాశాల. సెయింట్ జాన్స్ నేషనల్ అకాడమీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ భాగంగా కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తోంది. ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 7.88 లక్షలు

అమలా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కేరళ

ఈ కళాశాలలో ఏడాది ఎంబీబీఎస్ ఫీజు 7-8 లక్షల రూపాయలుగా ఉంది. 

Also read: Arthritis Precautions: ఆర్ధరైటిస్ తో బాధపడుతున్నారా, వెంటనే ఈ 5 పుడ్స్ మానేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News