India Covid-19 Cases: ఇండియాలో కరోనా పాజిటివ్ కేసులు 118 రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. కానీ కోవిడ్19 మరణాలు భారీగా నమోదయ్యాయి. మరోవైపు గత 109 రోజుల కనిష్టానికి కరోనా యాక్టివ్ కేసులు దిగొచ్చాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం ఉదయం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.
భారత్‌లో గడిచిన 24 గంటల్లో 31,443 మంది కరోనా బారిన పడ్డారు. ఏకంగా 118 రోజుల కనిష్టానికి కరోనా కేసులు దిగొచ్చాయి. తాజా కేసులతో కలిపితే దేశంలో ఇప్పటివరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 3.09 కోట్లకు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 2020 మంది కోవిడ్-19తో పోరాడుతూ చనిపోయారు. దేశంలో ఇప్పటివరకూ 4,10,784 (4 లక్షల 10 వేల 784) మంది కరోనా బారిన పడి చనిపోయారు. సోమవారం నాడు 49,007 మంది కరోనాను జయించారు. , ఇప్పటివరకూ 3 కోట్ల మంది కరోనాను జయించారు. దేశంలో 3,00,63,720 (3 కోట్ల 63 వేల 720) మంది కరోనా నుంచి కోలుకున్నారు.
Also Read: Covaxin Emergency Use: కోవాగ్జిన్ అత్యవసర వినియోగానికి WHO త్వరలోనే అనుమతి
India reports 31,443 new #COVID19 cases in the last 24 hours; the lowest in 118 days. Recovery rate increases to 97.28%. India's active caseload currently at 4,31,315; lowest in 109 days. pic.twitter.com/TXqEgq1eNs
— ANI (@ANI) July 13, 2021
దేశంలో యాక్టివ్ కేసులు నాలుగున్నర లక్షల దిగువకు చేరుకున్నాయి. ప్రస్తుతం 4 లక్షల 31 వేల 315 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. గత 109 రోజులలో ఇదే అత్యల్పమని హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. కరోనా బాధితుల రికవరీ రేటు 97.28 శాతానికి చేరుకుంది. జనవరి నుంచి జులై 12వ తేదీ వరకు దేశంలో 37,55,38,390 (37 కోట్ల 55 లక్షల 38 వేల 390 డోసుల కోవిడ్19 టీకాలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నేటి ఉదయం వరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు మొత్తంగా 39.46 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేసినట్లు వెల్లడించింది.
Also Read: COVID-19 Delta Variant: డెల్టా వేరియంట్ ప్రమాదకరమే, కరోనా టీకాల ప్రభావం అంతంతమాత్రమే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook